- బల్గేరియాలో తీవ్ర విషాదం… బస్సు మంటల్లో చిక్కుకుని 45 మంది దుర్మరణం
సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతున్న బస్సు
ఒక్కసారిగా బస్సులో మంటలు
కొన్ని నిమిషాల్లోనే అగ్నికి ఆహుతైన బస్సు
కాలి బూడిదైన పర్యాటకులు
బల్గెరియా లో జరిగిన బస్ ప్రమాదం 45 మంది సజీవదహనం అయ్యారు . బస్ లో మొత్తం 52 మంది ప్రయాణికులు ఉండగా 45 మంది మరణించడం ఒక్కసారిగా ఆ దేశంలో పౌరులను ఉలిక్కిపాటుకు గురిచేసింది. కేవలం 7 గురు ప్రయాణికులు మాత్రమే గాయాలతో బతికి బయట పడ్డారు . ఇది అత్యంత దారుణమైన సంఘటనగా ఆ దేశ ప్రధాని పేర్కొన్నారు . చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నారు .
యూరప్ దేశం బల్గేరియాలో ఓ లగ్జరీ బస్సు మంటల్లో చిక్కుకున్న ఘటనలో 45 మంది సజీవ దహనం అయ్యారు. ఈ బస్సు బల్గేరియా రాజధాని సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతుండగా మంటల్లో చిక్కుకుంది. ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దివ్యవధిలోనే బస్సు కాలిపోయింది.
ఈ ఘటనలో 45 మంది మరణించగా, ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. చనిపోయిన వారిలో 12 మంది చిన్నారులు ఉండడం అందరినీ కలచివేసింది. మృతదేహాలు ఏమాత్రం గుర్తించలేని విధంగా బూడిదగా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.