Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అన్న వద్దన్నారు…అమ్మ ఒకే చెప్పింది-పార్టీ ఏర్పాటుపై షర్మిల

తెలంగాణలో పార్టీ పెట్టవద్దని అన్న అన్నారు.అమ్మ మాత్రం తన అభిప్రాయానికి ఒకే చెప్పిందని వైయస్ షర్మిల అన్నారు.బుధవారం లోటస్ పాండ్ లో మీడియాతో చిట్ చార్ హించిన ఆమె పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కొందురు తెలంగాణలో పార్టీ పెట్టడం మాట్లాడుతున్నారని అసలు ఎక్కడ. నుంచి వచ్చారు. విజయశాంతిది ఎక్కడ అని ప్రశ్నించారు. ఎక్కడో పుట్టిన జయలలిత తమిళనాడు వచ్చి రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని గుర్తుచేసారు .అయినా తాను ఇక్కడే పిల్లలు కన్నాను. తన భర్తది ఇక్కడే కదా? అన్నారు. తనకు భర్త నుంచి సంపూర్ణ సహాయసహకారాలు ఉన్నాయన్నాయన్నారు. ఏపీలో వైయస్ ఆర్ కాంగ్రెస్ భారీ మెజారిటీ తో అధికారంలోకి వచ్చినప్పటికి అన్న జగన్ తనను ఎందుకు ప్రభుత్వంలో భాగస్వామిని చేయలేదో తనకు తెలియదన్నారు.తెలంగాణ ప్రజల అభివృద్ధి ,సంక్షేమమే లక్ష్యంగా పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. పోలవరం నుంచి పోతిరెడ్డి పాడు దాక తెలంగాణ కు జరుగుతున్న అన్యాయంపై రాజీపడే ప్రశక్తే లేదన్నారు.

Related posts

ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉంది…చండీఘర్ లో సీఎం కేసీఆర్!

Drukpadam

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఇక యుద్ధమే !

Drukpadam

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కమ్యూనిస్టుల పోటీ ఖాయం …!

Drukpadam

Leave a Comment