Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు

మార్చి 29తో ముగియనున్న నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం
చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఓ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ
సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో మరో స్థానం ఖాళీ
త్వరలోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
అభ్యర్థుల జాబితా వెల్లడించిన సజ్జల

YCP announced MLC candidates ఏపీలో త్వరలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. సి.రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్, కరీమున్నీసా, చల్లా భగీరథరెడ్డి, బల్లి కల్యాణచక్రవర్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులని సజ్జల తెలిపారు. ఏపీలో పలు కారణాలతో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మార్చి 29తో నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండగా, చల్లా రామకృష్ణారెడ్డి మృతితో మరో ఎమ్మెల్సీ స్థానం, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లడంతో మరో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్పడింది. కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టడంలేదని సజ్జల వెల్లడించారు.

Related posts

టైమ్స్ గ్రూప్ చైర్ పర్సన్ ఇందూ జైన్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్

Drukpadam

ఉద్యోగుల రిటైర్ మెంట్ వయస్సు పెంపుపై ఆగ్రహం

Drukpadam

అమెరికాలో మూతబడిన మరో బ్యాంకు!

Drukpadam

Leave a Comment