Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నాం: మోదీ

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నాం: మోదీ
-పలు ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి
-నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా మిగిలిన వాటిని ప్రైవేటుపరం చేస్తాం
-ప్రజా ధనాన్ని సద్వినియోగం కోసమే సంస్కరణలు
పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. దీనిపై దేశవ్యాపితంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం ప్రైవేటుపరం చేయనున్న సంస్థల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఒకటి. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఏపీలో పెను దుమారం రేగుతోంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేయడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం కాకా తప్పదనే సంకేతాలు మరో మరు బలంగా ఇచ్చినట్లు అయింది . వారసత్వంగా వస్తున్నాయనే భావనతో వాటిని నడపలేమని చెప్పారు. వాటిని పరిపుష్టం చేసేందుకు ఆర్థికసాయం చేయడం పెనుభారంతో కూడుకున్నదని అన్నారు.
ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, అవి ప్రజల ధనంతో నడుస్తున్నాయని చెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా ఇతర అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన వెబినార్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం వైదొలగే రంగాలను ప్రవేటు రంగం భర్తీ చేస్తుందని మోదీ చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించినప్పటి పరిస్థితులు వేరని అన్నారు. వ్యాపార రంగానికి కేంద్ర ప్రభుత్వం తమవంతు తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వం స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలను ఏర్పాటు చేసినప్పటి పరిస్థితులు వేరని… ఇప్పుడున్న పరిస్థితులు వేరని చెప్పారు. ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలనే లక్ష్యంతో సంస్కరణలను తీసుకొస్తున్నామని అన్నారు. సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఉద్ఘాటించారు.

Related posts

ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ 30 రోజులు ఉండాల్సిందే: ట్రాయ్!

Drukpadam

Why Bold Socks Are The ‘Gateway Drug’ To Better Men’s Fashion

Drukpadam

ఏపీ రాజధాని అంశంపై వాదనలు విన్న సుప్రీం కోర్టు!

Drukpadam

Leave a Comment