- ‘గాలిలో ఎగిరి గాలిలో కలిసిపోతావు’ మాటలకు అర్థమేంటి?
- జగన్ పై ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు?
- వైఎస్ మృతి అనుమానితుల్లో ఒకరన్న ఎంపీ
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన మరణంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందేమోనన్న అనుమానాలున్నాయని వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి అనుమానితుల్లో చంద్రబాబు ఒకరని ఆయన గుర్తు చేశారు. ‘గాలిలో ఎగిరి గాలిలో కలిసిపోతావు’ అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు.
ఇవాళ గుంటూరు జిల్లా పొన్నపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే.. వైఎస్సార్ మరణంలో చంద్రబాబు కుట్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. చంద్రబాబు అన్న ఆ మాటలకు అర్థం ఏంటని, ఏ ఉద్దేశంతో జగన్ పై చంద్రబాబు ఆ కామెంట్లు చేశారని ప్రశ్నించారు.