Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పల్లా గెలుపు నల్లేరు మీద నడకేం కాదు…

పల్లా గెలుపు నల్లేరు మీద నడకేం కాదు
-ప్రభుత్వం మీద వ్యతిరేకత
-పీఆర్సీ -నిరుద్యోగ భృతి ఎఫెక్ట్
-ఆయన అందుబాటులో ఉండదనే ప్రచారం
పట్టభద్రుల ఎన్నికలను అధికార టీఆరెఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది .తెలంగాణాలో జరుగుతున్నా హైద్రాబాద్ ,రంగారెడ్డి , మహబూబ్ నగర్ జిల్లాల నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని , ఖమ్మం , నల్లగొండ ,వరంగల్ జిల్లాల నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ని టీఆర్ యస్ అభ్యర్థులుగా పెట్టింది. పల్లా రాజేశ్వరరెడ్డి గతంలోనూ ఇదే పట్ట భద్రుల స్థానంనుండి ఎన్నికయ్యారు. వాణీదేవిని వ్యూహాత్మకంగా బరిలో నిలిపింది టీఆర్ యస్ .పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత పెద్దగా ఒరిగింది ఏమిలేదని అభిప్రాయాలూ ఉన్నాయి. పార్టీ పరంగా ఆయన పాత్ర ఆయన పోషించారని వాదనలు ఉన్న పట్టభద్రులు వాటిని గురించి పట్టించుకుంటరా అనే సందేహాలు లేకపోలేదు. ఎమ్మెల్సీగా ఎన్నికైన దగ్గరనుంచి ఆయన ఇంట్లో పడుకోలేదు.పైగా టీఆర్ యస్ కార్యక్రమాలలో కీలకంగా వ్యవహరించారు.పైగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఆయన అప్పగించిన పనులను చక్క దిద్దటంలో దిట్టగా ఆయనకు పేరుంది. అయితే గెలిచినా నియోజకవర్గాలను పట్టించుకోని నాయకులపై కోపం ఉండటం సహజం.అది ఆయనపై కూడా ఉంటుంది. అయితే ఆయన వ్యక్తిగతంగా చెడ్డవాడేం కాదు. ముక్కుసూటితనం గలవాడు .టీఆర్ యస్ వాదనలను బలంగా వినిపించగల నేత . కనే ప్రభుత్వం విధానాలతో విసిగి వేసారిన పట్టభద్రులు ప్రత్యేకంగా ఉద్యోగులు , నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వంపై కసిగా ఉన్నారు.వారిని మెప్పించటం కొంత కష్టమైనపనే .అయితే యువ పట్టభద్రులు ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఓటర్లు భారీగానే ఉన్నారు. ఎవరు మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవరనే అభిప్రాయాలే ఉన్నాయి. అందువల్ల రెండవ ప్రాధాన్యేతే ఓట్లే కీలకం కానున్నాయి . అప్పుడు గెలుపోటములు నిర్ణయించే రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికీ ఎక్కువస్తే వారివిజేతలు అవుతారు. ప్రధానంగా టీఆర్ యస్ తో పాటు బీజేపీ , కాంగ్రెస్ ,వామక్షాలు బలపరిచిన అభ్యర్థితోపాటు , తెలంగాణ ఉద్యమం లో ప్రముఖ పాత్రవహించిన ప్రొఫెసర్ కోదండరాం,ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ , తీన్మార్ మల్లన్న , రాణి రుద్రమ పోటీలో ఉన్నారు.వీరిలో ఎవరి బాలాలు వారికీ ఉండటంతో పాటు , వారి వారి బలహీనతలు కూడా ఉన్నాయి. అందువల్ల ఎవరికీ వారు ధీమాతో ఉన్నారు. మాస్ ర్యాలీలు , సభలు , సమావేశాలు , నిర్వించి ప్రచారాన్ని ఉదృతంగా సాగిస్తున్నారు. అందువల్ల , టీఆర్ యస్ అభ్యర్థిగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు నల్లేరుపై నడక కాదనే అభిప్రాయాలే ఉన్నాయి. ఈ సారి ఓటర్లుగా యువకులే ఎక్కువమంది ఉన్నారు. అందులో ఉద్యోగాలు లేనివారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లాలో సహజంగా ప్రభుత్వం వ్యతిరేకత అధికంగానే ఉంది. పెన్షన్లు ,రైతుబంధు ,ఇస్తున్నప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదనే అభిప్రాయాలే యువతలో ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా నిరుద్యోగులకు భృతి ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిన ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వకపోవడంపై కూడా యువత ఆందోళనగా ఉన్నారు. వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఉద్యోగుల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. రెండవసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఉద్యోగులుకు పీఆర్సీ ఇస్తానని చెప్పారు అందుకోసం పీఆర్సీ కమిటీ నియమించారు. దాని నివేదిక వాయిదాల మీద వాయిదాలతో రెండు సంత్సరాలు గడిపారు. చివరకు ఇచ్చిన నివేదికలో కేవలం 7 .5 శాతం మాత్రమే ఫిట్ మెంట్ సిఫార్స్ చేయడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీనితో పాటు ఉద్యోగుల పదవి విరమణ వయసు ను 58 సంవత్సరాలు ఉండగా దాన్ని 61 సంవత్సరాలకు పెంచుతామని ఎన్నికల ప్రణాళికలో చెప్పారు.అప్పుడప్పుడు ఉద్యోగులకు వయోపరిమితి పెంచుతున్నట్లు ప్రకటనలు మాత్రం వస్తున్నాయి తప్ప పెంచింది లేదు. అందువల్ల వారు భగ్గుభగ్గు మంటున్నారు . కొంతమంది ఉద్యోగ సంఘ నాయకుల వల్లనే తమకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయాలూ ఉద్యోగ వర్గాలలో ఉంది.వారు కూడా అవకాశం కోసం చూస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టభద్రుల్లో అభిప్రాయాలూ బలంగా ఉన్నాయి.అదే సందర్భంలో ఉద్యమకారుల్లో చీలిక ఉండటం ఒక్కటే అధికార టీఆర్ యస్ అభ్యర్థిగా అనుకూలంగా మారే ఛాన్స్ ఉండవచ్చునని పరిశీలకుల అభిప్రాయం. సాధారణ ఎన్నికలను తలపించే రీతీలో జరుగుతున్నా ప్రచారంలో విజేతలు ఎవరు పరాజితులు ఎవరు అనేది ఆశక్తిగా మారింది…..

 

Related posts

భోజనం కేజ్రీవాల్ కు …ఓటు బీజేపీకి … ఆటో డ్రైవర్ విక్రమ్ వైఖరిపై చర్చ ..

Drukpadam

యూపీఏనా… ఇంకెక్కడుంది?: మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు…

Drukpadam

షర్మిల పార్టీ పేరుపై అభ్యంతరం …అన్న చెల్లెలు మధ్య యుద్ధం తప్పదా…?

Drukpadam

Leave a Comment