కాంగ్రెస్ పార్టీ వరి దీక్ష కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక
వరి ధాన్యం కొనకపోతే ప్రభుత్వాల పతనం ఖాయం
రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టలేదు
విద్యుత్ ఉద్యమం ప్రభుత్వాన్నే మార్చింది.
వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోక తప్పలేదు
మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య
బలిసిన దున్నపోతు
కొవ్వెక్కిన కోడె గిత్త ను
రైతే దారికి తెచ్చి , నాగలితో దున్నుతాడు
అలాగే రైతులే …..మదమెక్కిన ముఖ్యమంత్రి
ప్రగల్భాలు పలికే ప్రధాన మంత్రులకు
బుద్ధి చెపుతారు
రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు . ఈరోజు గాంధీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలవల్ల రైతులకు నష్టం జరుగుతుందని వాటిని రద్దు చేయాల్సిందేనని రాహుల్ గాంధీ మొదటి నుంచి చెబుతున్న విషయాన్నీ గుర్తు చేశారు. రైతు ఉద్యమ సంత్సర కాలం నడిచింది నూతన చట్టాలను రద్దు చేసే ప్రశక్తే లేదని ప్రధాని అనేక మార్లు చెప్పారు . రైతులు అమాయకులని భావించారు. కానీ పట్టుదలతో రైతుల ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు అని అన్నారు. …
భారత దేశానికి వ్యవసాయానికి అభినాభావ సంబంధం ఉంది .దేశంలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడతారు .పార్లమెంటరీ వయ్వస్థలో చర్చలు, మేధావుల సలహాలు తీసుకోకుండా వ్యవసాయ చట్టాలకు చెందిన ఆర్డినెన్స్ తీసుకొచ్చారు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేశారు. ఎండకు ఎదురు , వానకు తడుస్తూ , చలికి వణుకుతూ చేసిన రైతు ఆందోళనలో అనేక మంది రైతులు చనిపోయిన విషయాన్నీ పొన్నాల గుర్తు చేశారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ ముందే డిమాండ్ చేశారని అన్నారు. .పెట్టుబడి దారులకి కొమ్ముకాసే చట్టాలు అవి అని చెప్పారు . చట్టాలు వెనక్కి తీసుకోవడం….రైతులు, కాంగ్రెస్ విజయంగా అభివర్ణించారు.
కాంగ్రెస్ హయాంలో ఈ స్థాయిలో ఆందోళనలు జరిగాయా …?రైతే రాజు అనే నినాదంతో కాంగ్రెస్ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. 2013 భూసేకరణ చట్టం తీసుకొస్తే …సవరణలు చేసి వెనక్కి తీసుకున్నారు. పార్లమెంట్ లో సవరణలు చేసి భూసేకరణ చట్టాన్ని ఆమోదించకుండా వెనక్కి తీసుకున్నారు .విత్తన చట్టం కూడా పార్లమెంటులో సవరణలు చేసి వెనక్కి తీసుకున్నారు
గోదాముల్లో నిల్వలు ఉంటే వ్యవసాయశాఖ మంత్రి ఏం చేస్తున్నారు ప్రశ్నించారు ..ఎగుమతులని పెంచాల్సిన బాద్యత కెంద్రం తీసుకుందా అంటే లేదు … రైతులకోసమే ఏమి చేస్తున్నట్లు వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. కానీ రైతు ఉద్యమం ముందు వారి పప్పులు ఉడకలేదని అన్నారు .
వారి ధాన్యం కొనే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్న విషయం రైతులకు కూడా తెలిసి పోయింది. కేంద్రంతో యుద్ధం అంటూ అక్కడికి వెళ్లి వంగివంగి నమస్కారాలు పిల్లిలాగా వస్తున్నా విషయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వరి దీక్ష ఒక హెచ్చరిక లాంటిది…ప్రభుత్వ పతనానికి పునాది .రైతుల విషయంలో దగా చేస్తే ప్రభుత్వ పతనం తప్పదన్నారు . అప్పటి విద్యుత్తు ఆందోళన ప్రభుత్వాన్నే మార్చిన విషయాన్నీ పొన్నాల గుర్తు చేశారు.