ఘనంగా ప్రారంభమైన సిపిఎం ఖమ్మం జిల్లా 21 వ మహాసభలు
-దిశ నిర్దేశం చేసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
-పాల్గొన్న వేయిమంది ప్రతినిధులు
-రాష్ట్ర పార్టీ నుంచి పరిశీలకుల రాక
-అరుణకాంతులీనిన సభా ప్రాంగణం
ఈ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా 500 మంది ప్రతినిధులను ఆహ్వానించారు . వీరితో పాటు మరో 500 మందిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. దాదాపు అందరూ ఎరుపురంగు దుస్తులు ధరించడం, సభా ప్రాంగణంలో ఎరుపుతోరణాలు, కమ్యూనిస్టు యోధులు వ్యాఖ్యలతో కూడిన ప్లెక్సీలతో ఎటుచూసినా అరుణవర్ణ శోభితమైంది. ఎర్రజెండా రెపరెపలాడింది.
సభా ప్రారంభానికి ముందు పార్టీ సీనియర్ నాయకులు మామిళ్ల సంజీవరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడే ఉన్న అమరవీరులు స్థూపానికి నివాళులు అర్పించి ప్రతినిధులు సభా ప్రాంగణంలోకి ప్రవేశించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పాన్నం వెంకటేశ్వర్లు అతిథులను వేదిక మీదకు ఆహ్వానించారు.
పార్టీ పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి ఈ మహాసభలు పరిశీలకులుగా తమ్మినేనితో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, పోతినేని సుదర్శన్, బత్తుల ‘హైమావతి, సాయిబాబా హాజరయ్యారు.
మహాసభల ఆహ్వానసంఘం గౌరవ అధ్యక్షులు రవి మారుతి , అధ్యక్షులు యలమంచిలి రవీంద్రనాథ్ ప్రతినిధులను ఉ త్సాహ పరిచేలా ఉపన్యసించారు . పార్టీ రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, ఎం. సుబ్బారావు, మాచర్ల, భారతి, పాలడుగు భాస్కర్, శోభన్, రాష్ట్ర నాయకులు జి. ధర్మ, సోమయ్య, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, వెంకటేశ్వర్లు ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రమేష్, భూక్యావీరభద్రం తదితరులు పాల్గొన్నారు.