Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏప్రిల్ 9 న ఖమ్మంలో షర్మిల శంఖారావం…?

ఏప్రిల్ 9 న ఖమ్మంలో షర్మిల శంఖారావం
-పార్టీ ప్రకటన అక్కడే ఉండే అవకాశం
-లక్షమందితో సభ పెట్టాలని యోచన
-ఖమ్మం నేతలతో సమావేశం
తెలంగాణాలో పార్టీ పెడుతున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అందువకు స్పీడ్ పెంచారు. ఏప్రిల్ 9 ఖమ్మంలో శంఖారావం పూరించేందుకు సిద్ధమైయ్యారు. ఖమ్మం వైయస్ అభిమానులు అధికంగా ఉండటంతో పాటు గిరిజనులు ఎదుర్కుంటున్న పోడుభూముల సమస్య ఉండటంతో దానిపై దృష్టి సారించారు.పార్టీ ప్రకటన కూడా అక్కడే ఉండే అవకాశం ఉందని సమాచారం . లక్షమందితో సభపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఖమ్మం నేతలతో ఆమె ప్రాధమికంగా చర్చించినట్లు సమాచారం. అక్కడనుంచే రాష్ట్రంలో యాత్రలకు తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనికోసం సీరియస్ గా కసరత్తు జరుగుతుంది. పార్టీ జెండా , ఎజెండా , విధివిధానాలు ఖమ్మం లో ప్రకటించే అవకాశం ఉందని ఆమె అభిమానులు చెబుతున్నారు. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైయస్ ఆర్ విధానాలు ప్రతిబంభించేలా పార్టీ విధానాల రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తుంది. వైయస్సార్ సంక్షేమ కార్యక్రమాలు లక్ష్యంగా తాను తెలంగాణాలో పార్టీ పెడుతున్నట్లు ఆమె చెప్పకనే చెప్పుతున్నారు. పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగడంలేదని ఆమె అంటున్నారు. ఫిబ్రవరి తొమ్మిదినుంచి ఆమె తెలంగాణ నేతలతో వరస భేటీలు అవుతున్నారు . మొదట నల్లగొండ నేతలతో సమావేశం అయినా షర్మిల , హైద్రాబాద్, రంగారెడ్డి నేతలతోనూ సమావేశం అయ్యారు. అనేక మంది ప్రముఖులను కలిశారు. రిటైర్ ఐఏఎస్ ,ఐ పి యస్ అధికారులతో భేటీ అయ్యారు. ఎస్సీఈ ,ఎస్టీ ,బీసీ నేతలను ఆమె కలిశారు. సామాజిక కార్యకర్తలతోను , ఇతర ప్రముఖులను కలుస్తూనే విద్యార్థులతో సమావేశం అయ్యారు.
ఏపీ ముఖ్యమంత్రి అన్న జగన్ తో సంబంధాలపై
ఏపీ ముఖ్యమంత్రి ,అన్న జగన్ తో సంబంధాలపై ఆమెను ప్రశ్నించగా ,తాను తెలంగాణాలో పార్టీ పెట్టడం అన్నకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పారు. తరువాత వైయస్ కుటుంబానికి సన్నిహితుడు , జగన్ పార్టీ ముఖ్యడు,మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణ రెడ్డి కూడా పార్టీ విషయంలో షర్మిలను కలిసి చర్చించారు. ఆయన జగన్ దూతగానే వచ్చాడని ప్రచారం జరిగింది. కానీ ఆమె తాను తెలంగాణాలో పార్టీ పెట్టె నిర్ణయంపై వెనక్కు తగ్గలేదు . జగన్ ఏపీలో భారీ మెజార్టీ తో గెలిచినా తనకు ఎందుకు అక్కడ ఆవకాశం కల్పించలేదో ఆయననే అడగాలని ఆమె సూచించారు. జగన్ అన్నతో తనకు పార్టీ విషయంలో తప్ప తేడాలు లేవని అన్నారు. తన తల్లి తాను పార్టీ పెట్టె విషయాన్నీ వ్యతిరేకించలేదని తెలిపారు. భర్త అనిల్ తనకు పూర్తీ సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. అందరికన్నా ప్రజల పట్ల విశ్వాసం ,రాజశేఖర్ రెడ్డి అభిమానుల అండదండలు తనకు ఉంటాయని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
షర్మిల ఎవరు వదిలిన బాణం
షర్మిల ఎవరు వదిలిన బాణం అనే విషయం పై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఆమె కేసీఆర్ వదిలిన బాణం అని బీజేపీ అంటుంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అన్నారు. టీఆర్ యస్ పార్టీ నుంచి పెద్దగా విమర్శలు లేవు అందువల్ల బీజేపీ ,కాంగ్రెస్ చేసే వాదనలకు బలం చేకూరుతుంది. అయితే మంత్రి గంగుల కమలాకర్ మాత్రమే షర్మిల పార్టీ పై విమర్శలు గుప్పించారు. ఆమె ఇక్కడ పార్టీ పెట్టడం అంటే తిరిగి ఆంధ్ర పాలనను తేవడమే అని అన్నారు. అందువల్ల ఆపార్టీని వ్యతిరేకించాలని అన్నారు. ఇంతకూ మించి అక్కడక్కడా ఒకరో ఆరో విమర్శలు చేసినప్పటికీ టీఆర్ యస్ పై ఇప్పటికి అనుమానాలు ఉన్నాయి. అయితే ఆమె పార్టీ తెలంగాణాలో టీఆర్ యస్ కు వ్యతిరేకంగానే పనిచేయాల్సిఉంటుంది . ఇక కాంగ్రెస్ ,బీజేపీలకు ఆమె ఎంతవరకు నష్టం చేస్తారనేది ఆమెకు ప్రజలలో వస్తున్నా ఆదరణను బట్టి ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం.

Related posts

అన్న వదిలిన బాణం రివర్స్ అయి0ది …షర్మిల కా0గ్రెస్ లో చేరికపై చంద్రబాబు

Ram Narayana

భాగ్యనగరంలో శోభాయమానంగా గణేష్ నిమజ్జనం ….

Drukpadam

ప‌న్ను ఎగ‌వేత ఆరోప‌ణ‌లు.. సోనూసూద్ ఇళ్ల‌పై మ‌ళ్లీ ఐటీ దాడులు…

Drukpadam

Leave a Comment