Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అమెరికాలోని స్కూల్‌లో కాల్పులు.. ముగ్గురు విద్యార్థుల మృతి!

అమెరికాలోని స్కూల్‌లో కాల్పులు.. ముగ్గురు విద్యార్థుల మృతి

  • డెట్రాయిట్‌కు 48 కిలోమీటర్ల దూరంలోని ఆక్స్‌ఫర్డ్‌లో ఘటన
  • పోలీసుల అదుపులో 15 ఏళ్ల కుర్రాడు
  • 15 నుంచి 20 రౌండ్ల వరకు కాల్పులు
  • సెమీ ఆటోమెటిక్ హ్యాండ్ గన్ స్వాధీనం

అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. ఓ స్కూల్‌లోకి చొరబడిన దుండగుడు యథేచ్ఛగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు. వీరిలో 16 ఏళ్ల బాలుడు, 14, 17 సంవత్సరాల వయసున్న ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మరో 8 మంది గాయపడ్డారు. మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌‌కు 48 కిలోమీటర్ల దూరంలోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్న హైస్కూల్‌లో నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

దుండగుడి కాల్పుల్లో గాయపడిన వారిలో ఓ టీచర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పాఠశాలకు చేరుకున్న పోలీసులు అనుమానితుడైన 15 ఏళ్ల కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఓ సెమీ ఆటోమెటిక్ హ్యాండ్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 15 నుంచి 20 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు.

Related posts

లిక్కర్ స్కాం … ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో ఎమ్మెల్సీ కవిత పేరు …!

Drukpadam

రూ.10 కోట్లు ఇవ్వాలని వ్యాపారికి బెదిరింపు… చోటారాజన్ ముఠా అరెస్ట్

Ram Narayana

జైల్లో తీన్మార్ మల్లన్న నిరాహార దీక్ష చేయడం లేదు: జైలు సూపరింటెండెంట్!

Drukpadam

Leave a Comment