Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మార్చ్, ఏప్రిల్ మాసాల్లో ప్రాంతీయ సదస్సులు-టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ

TUWJ రాష్ట్రకార్యవర్గ విస్త్రతస్థాయిసమావేశంలో మాట్లాడుతున్న ప్రధాన కార్యదర్శి విరావత్ అలీ

మార్చ్, ఏప్రిల్ మాసాల్లో ప్రాంతీయ సదస్సులు
టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం తగు కార్యాచరణ రూపొందించుకోడానికి గానూ మార్చ్, ఏప్రిల్ మాసాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ తెలిపారు. శుక్రవారం బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్. శేఖర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. నాలుగైదు జిల్లాలను కలిపి రాష్ట్రంలో ఏడు చోట్ల ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు విరాహత్ స్పష్టం చేశారు. ప్రతి సదస్సులో 2 నుండి 3 వేల మంది జర్నలిస్టులు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి 125వ జయంతోత్సవాల్లో భాగంగా బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప రెడ్డి ఆడిటోరియం ఆధునికరణకు తమ యూనియన్ విజ్ఞప్తి మేరకు 2.30కోట్ల నిధులు మంజూరీ చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.టి.రామారావుకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన చెప్పారు. సురవరం జయంతోత్సవాల సందర్భంగా హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ పట్టణాల్లో యూనియన్ ఆధ్వర్యంలో తెలుగు జర్నలిజం- విలువలు అంశంపై త్వరలో సెమినర్లు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ సాకుతో ప్రచురణను నిలిపివేసి చేతులెత్తేసిన ఆంధ్రభూమి పత్రిక యాజమాన్య వైఖరిపై ఉద్యోగులు చేస్తున్న న్యాయ పోరాటానికి తమ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించినట్లు విరాహత్ వివరించారు.

Related posts

ప్రయాణికులకు శుభవార్త …ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కు గ్రీన్ సిగ్నల్!

Drukpadam

సినీ నటుడు మోహన్ బాబు పై బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో కేసు …

Drukpadam

బాల్ బ్యాడ్మింటన్ మాంత్రికుడు అర్జున పిచ్చయ్య(104) మృతి!

Drukpadam

Leave a Comment