Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కుప్పం చుట్టూ ఏపీ రాజకీయాలు…

కుప్పం చుట్టూ ఏపీ రాజకీయాలు
-పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీ
-రసకందాయకంగా మరీనా చంద్రబాబు కుప్పం పర్యటన
-జూనియర్ ఎన్ఠీఆర్ రావాలంటూ నినాదాలు
-అలాగే అంటూ తల ఆడించిన చంద్రబాబు
జగన్ ఉన్మాద ముఖ్యమంత్రి , పుగనూరు పుడింగి పెద్దిరెడ్డి
– ఏ ఎన్నికల్లో పోటీచేసి గెలవని సజ్జల నన్ను విమర్శిస్తారా ?
-వైసిపి పై చంద్రబాబు విసుర్లు

ఏపీ రాష్ట్ర రాజకీయాలు కుప్పం చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తన్నందున దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో కుప్పంలో టీడీపీ మద్దతు దార్లు దారుణంగా ఓటమి చెందారు. తన నియోజకవర్గంలో ఇంతటి దారుణ ఓటమి ఉంటుందని ఊహించని చంద్రబాబు ఎన్నికల నిర్వహణ పట్ల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తన నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు . దీనితో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన పర్యటనలో జూనియర్ ఎన్ఠీఆర్ ప్రస్తావన వచ్చింది. తెలుగుదేశం అభిమానులు కొందరు నినాదాలు చేస్తూ జూనియర్ ఎన్ఠీఆర్ ను ప్రచారానికి తీసుకురావాలని నినదించారు.ఆయన కటౌట్లు కూడా భారీగా కట్టారు. కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కాకుండా జూనియర్ ఎన్ఠీఆర్ ను తీసుకు రావాలనే డిమాండ్ రావటం చర్చనీయాంశం అయింది. చంద్రబాబు తన పర్యటనలో కార్యకర్తల ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తూనే , రాష్ట్రము కోసం మిమ్ములను విస్మరించాను అసలు ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఏముంది రాష్ట్రాన్ని బాగుచేయాలని తపనతప్ప అని నిట్టూర్చారు. కార్యకర్తలను ఇక నుంచి ఎలా చూసుకుంటానో చూడండని అన్నారు. కుప్పంకు ఎవరు వస్తారో చూస్తానని వైసిపి ని ఉద్దేశించి అన్నారు. సీఎం జగన్, జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై విమర్శలు గుప్పించారు. జగన్ ఉన్మాద ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి పుంగనూరు పుడింగి జగన్ రౌడీయిజాన్ని నేర్చుకున్నారని అన్నారు. జగన్ పాలనలో ఊరూరికి రౌడీలు తయారు అయ్యారని అన్నారు. టీడీపీ కార్యకర్తలు కొండవీటి సింహాల్లా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.మేధావులు ప్రభుత్వ చేతకాని తనాన్ని ప్రశ్నించాలని అన్నారు. పోలీస్ వ్యవస్థ భ్రుష్టు పట్టిందని ,తనదగ్గర వంగి వంగి నమస్కారాలు పెట్టిన వాళ్ళు కూడా తమాషాలు చేస్తున్నారని మంది పడ్డారు.జగన్ అబద్దాల కోరు చెప్పేది ఒకటి చేసేదొకటి ప్రజలు గమనించాలన్నారు. మద్యపానాన్ని ఎందుకు నిషేదించారని ప్రశ్నించారు. ఏ ఎన్నికల్లో పోటీ చేసి గెలవని సజ్జల రామకృష్ణరెడ్డి తనను విమర్శస్తారా ? ఆయనకేం అర్హత ఉందని ప్రశ్నించారు.పోలీసులు లేకుండా నేను బజార్లో తిరుగుతాను ఆయన తిరగగలరా అన్నారు. ? మంత్రులు తిరగగలరా ? అని సవాల్ విసిరారు . కుప్పం జగన్ జాగీరుకాదని కుప్పం లోనే మకాం వేసి వైసిపి కి డిపాజిట్ లేకుండా చేస్తానని అన్నారు. పోలవరం, విశాఖ స్టీల్ , అన్ని పోయాయని పోవటమే తప్ప వచ్చేవి ఏమిలేవని అన్నారు.పుంగనూరు లో పెద్దిరెడ్డికి డిపాజిట్ లేకుండా చేస్తనని అన్నారు.గేరు మర్చి తన తడాకా ఏమిటో చూపిస్తానని ఆగ్రంగా అన్నారు.

వైసిపి అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లడుతూ సీఎం జగన్ వల్లే చంద్రబాబు కుప్పం గల్లిలలో తిరుగుతున్నారని అన్నారు.జూనియర్ ఎన్ఠీఆర్ బొమ్మ పెట్టుకుని తిరగాల్సిన దుస్థితి చంద్రబాబుకు వచ్చిందన్నారు.14 ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పంకు జగన్ ను నీళ్లు ఇవ్వమనిఅడుగుతున్నారని అన్నారు.తాను అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికల ప్రణాళిక అమలు చేయలేని చంద్రబాబు ఇప్పుడు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.

Related posts

ప్రతిపక్షాలు ఐక్యంగానే ఉన్నాయి….ఆశ్చర్యకర ఫలితాలు రావడం ఖాయం …అమెరికా పర్యటనలో రాహుల్ …

Drukpadam

ఉత్తమ్ , భట్టిపై విహెచ్ ధ్వజం …

Drukpadam

రేపు ఉదయం 8 గంటల నుంచి చంద్రబాబు దీక్ష!

Drukpadam

Leave a Comment