Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

కోహ్లీ అవుట్ పై వివాదం…. టీవీ అంపైర్ పై తీవ్ర విమర్శలు…

కోహ్లీ అవుట్ పై వివాదం…. టీవీ అంపైర్ పై తీవ్ర విమర్శలు…
ముంబయిలో రెండో టెస్టు
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
కోహ్లీ ఎల్బీడబ్ల్యూ
బంతి బ్యాట్ కు తగిలినట్టు రీప్లేలో వెల్లడి

న్యూజిలాండ్ తో ముంబయిలో జరుగుతున్న టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యరీతిలో డకౌట్ అయ్యాడు. కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంతి ప్యాడ్లకు తగిలిందని భావించిన అంపైర్ అవుట్ అంటూ వేలెత్తగా, కోహ్లీ రివ్యూ కోరాడు. అయితే రివ్యూలో బంతి బ్యాట్ కు తగిలినట్టుగా కనిపించింది. కానీ టీవీ అంపైర్ కూడా అవుటిచ్చాడు. దాంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.

దీనిపై సీబీఐ విచారణ అవసరం అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. థర్డ్ అంపైర్ ను కటకటాల వెనక్కి నెట్టాలంటూ డిమాండ్ చేశాడు. మరో నెటిజన్ థర్డ్ అంపైర్ ను కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారితో పోల్చాడు. పార్థివ్ పటేల్ వంటి సీనియర్ ఆటగాడు కూడా ఇది అంపైర్ తప్పిదమేనని తేల్చి చెప్పాడు. మాజీ ఆటగాడు వసీం జాఫర్ స్పందిస్తూ, కనీస జ్ఞానం కొరవడిందని విమర్శించాడు.

 

ముంబయి టెస్టులో ముగిసిన తొలి రోజు ఆట… టీమిండియా స్కోరు 221/4

  • ముంబయిలో భారత్ వర్సెస్ కివీస్
  • ప్రారంభమైన రెండో టెస్టు
  • టాస్ గెలిచిన భారత్
  • తొలి ఇన్నింగ్స్ లో కుదుపులు
  • అజాజ్ పటేల్ కు 4 వికెట్లు
Day one concludes in Mumbai test between Team India and New Zealand

వాతావరణం అనుకూలించక ఆలస్యంగా మొదలైన ముంబయి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ 120 పరుగులతోనూ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టీమిండియా కోల్పోయిన 4 వికెట్లు కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఖాతాలోకి చేరాయి. కొన్ని బంతుల వ్యవధిలోనే ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (44), ఛటేశ్వర్ పుజారా (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) వికెట్లను చేజిక్కించుకున్న అజాజ్ పటేల్… ఆ తర్వాత ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ వికెట్ కూడా సాధించాడు. తొలి టెస్టులో సెంచరీ సాధించిన అయ్యర్ ఈసారి 18 పరుగులు చేశాడు.

ఓ దశలో 80 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ ను మయాంక్-అయ్యర్ జోడీ 160 పరుగుల వరకు చేర్చింది. అయ్యర్ అవుటైన తర్వాత మయాంక్ కు సాహా జత కలిశాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 200 మార్కు దాటించారు.

Related posts

మ్యాచ్ మధ్యలో గుండెపోటు.. చైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ మృతి..

Ram Narayana

ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్: టీమిండియా ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచిన పాకిస్థాన్

Ram Narayana

ఐపీఎల్ జరగాలంటే… బీసీసీఐ ముందున్న ఆప్షన్లు ఇవే!

Drukpadam

Leave a Comment