అంతర్జాతీయం

పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి…

  • బన్నూలోని చెక్ పాయింట్ వద్ద ఆత్మాహుతి దాడి
  • 10 మంది సైనికుల మృతి
  • తామే దాడి చేశామన్న హఫీజ్ గుల్ బహదూర్, తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్

పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ దగ్గర ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేశాడు. ఆ తర్వాత అతని సహచరులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 10 మంది పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ దాడి చేసింది తామేనని హఫీజ్ గుల్ బహదూర్ సంస్థ, తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ ప్రకటించుకున్నాయి. తమ సభ్యులలో ఒకరిని లక్ష్యంగా చేసుకుని భద్రతాదళాలు వెతకడంతో ఈ దాడికి పాల్పడినట్టు పేర్కొన్నాయి. 2021లో ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు తిరిగి అధికారాన్ని పొందిన తర్వాత… పాకిస్థాన్ లోని సరిహద్దు ప్రాంతాల వద్ద హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. 

Related posts

అప్పట్లో పుతిన్ ను చంపేందుకు ప్రయత్నించారు.. బైడెన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు

Ram Narayana

నేను ఆట మొదలుపెడితే.. చైనాకు వినాశనమే.: ట్రంప్‌ వార్నింగ్

Ram Narayana

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులపై నిషేధం!

Ram Narayana