Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం లో పాత బస్ స్టాండ్ పరిరక్షణ సమితి ఉద్యమం ఉద్రిక్తం…

ఖమ్మం లో పాత బస్ స్టాండ్ పరిరక్షణ సమితి ఉద్యమం ఉద్రిక్తం
ఖమ్మం లో పాత బస్ స్టాండ్ పరిరక్షణ సమితి ఆధ్వరంలో జరుగుతున్నా ఆందోళన ఉద్రిక్తలకు దారితీసింది.శనివారం పరిరక్షణ సమితి నిర్వవించిన పదర్శనను పోలీసులు అడ్డుకోవటంతో వారి మధ్య జరిగిన తోపులాటలో పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు.ఈ సందర్భంగా ఒక ఎస్ ఐ చూపిన అతి ఉత్సహమే ప్రదర్శన కారులు గాయపడటానికి దారితీసిందని ఆందోళకారులు ఆరోపిస్తున్నారు. ఆందోళన ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల తోపులాటలో సిపిఎం కు చెందిన యర్రా శ్రీనివాస్ , ఎం ఏ జబ్బార్ లకు గాయాలైయ్యాయి.గత కొంత కాలంగా నడుస్తున్న బస్ స్టాండ్ పరిరక్షణ ఉద్యమం తీవ్రరూపం దాల్చటం తో ఖమ్మం నగరంలో చర్చనీయాశం అయింది. సిపిఎం, కాంగ్రెస్, సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ , పార్టీల ఆధ్వరంలో సాగుతున్న ఈ ఉద్యమానికి పాత బస్ స్టాండ్ పై ఆధారపడి వ్యాపారాలు సైతం తోడైయ్యారు.
అధికారం ఉందని అహంకారం తగదు … తిరిగి పాత బస్ స్టాండ్ ఇక్కడ లోకల్ బస్టాండ్ గా కొనసాగించే వరకు తమ ఉద్యమం ఆగదని ఆందోలన కారకులు హెచ్చరించారు. అనేక చిన్న,చిన్న పట్టణాలలో రెండు బస్టాండ్ లు ఉన్నాయి. మన పక్కనే ఉన్న సూర్యాపేట లో సైతం పాత బస్ స్టాండ్ ఉంది. దాన్ని లోకల్ బస్టాండ్ గా ఉపయోగించు కుంటున్నారు. అది చాల చిన్న పట్టణం . మనం మున్సిపాల్టీ నుంచి కార్పొరేషన్ కు ఎదిగాం అయినా రెండవ బస్టాండ్ ఎత్తివేసే ఆలోచన తగదు. తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని నాయకులూ హెచ్చరించారు. జిల్లాకే చెందిన రవాణా శాఖామంత్రి మౌనం వీడాలని వారు డిమాండ్ చేశారు. లేనట్లయితే ఉద్యమాన్ని గ్రామాలలోకి సైతం తీసుకొని పోతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ,కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , సిపిఎం నాయకులూ యర్రా శ్రీకాంత్, అప్రోజ్ సమీనా ,విక్రమ్, యర్రా శ్రీనివాస్ రావు , ఎం ఎల్ న్యూ డెమోక్రసీ నాయకులూ అశోక్ , జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నియో నాజీలనుంచి ఉక్రెయిన్ మాతృభూమిని రక్షించేందుకే సైనిక చర్య :పుతిన్!

Drukpadam

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం…

Drukpadam

ఘోర ప్రమాదం: లోయలో పడ్డ బస్సు 32 మంది మృతి

Drukpadam

Leave a Comment