Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం…

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం…
-ఉగాది తరువాత ఎన్నికల షడ్యూల్ వచ్చే ఆవకాశం
-ఏప్రిల్ చివరలో ఎన్నికలు
-ఖమ్మం లో పెరిగిన డివిజన్ల సంఖ్య
-అభ్యర్థుల ఎంపికలో రాజకీయపక్షాలు
-స్థానిక సమస్యలు ,కులాల సమీకరణలే ప్రాధాన్యం
-తాజా మాజీలలో ఎందరికి ఆవకాశం వస్తుందో మరి

ఖమ్మంనగర కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి . ఏప్రిల్ నెలలోనే ఎన్నికలు పెట్టాలనే ఆలోచనలో టీఆర్ యస్ ఉంది.ఖమ్మం, వరంగల్ , సిద్ధిపేట కార్పొరేషన్లతో పాటు, అచ్చంపేట మున్సిపాలిటీ కి ఎన్నికలు జరగాల్సివుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఉగాది తరువాత ఎన్నికల షడ్యూల్ ప్రకటించనున్నారని సమాచారం. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీ ,కార్పొరేషన్లలో డివిజన్ల పునర్విభజన జరిగి ఫైనల్ లిస్టు కూడా ప్రకటించారు.ఖమ్మంలో 50 డివిజన్లు గా ఉన్న కార్పొరేషన్ 60 డివిజన్లు అయింది. డివిజన్లు పెరగటంతో ఆశావహుల సంఖ్య కూడా పెరిగింది. ప్రధానంగా టీఆర్ యస్ కాంగ్రెస్ ప్రధాన పోటీ పడుతున్నా ఈ సారి బీజేపీ కూడా ఖమ్మం ఖిల్లాపై కమలం జెండాను రెపరెపలాడించాలనే పట్టుదలతో పావులు కదుపుతుంది.కార్పొరేషన్ లో సిపిఎం ,సిపిఐ లకు బలమైన ఓటింగు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఒకప్పుడు ఖమ్మం మున్సిపాలిటీ ని ఏకధాటిగా మూడు దశాబ్దాలకు పైగా సిపిఎం పాలించింది.సిపిఐ నగరంలోని కొన్ని డివిజన్లలో ఓటింగ్ కలిగి ఉంది. గత ఎన్నికల్లో సిపిఎం ,సిపిఐ చెరో రెండు స్థానాలలో విజయ సాధించాయి. టీఆర్ యస్ 50 డివిజన్లలో 34 గెలుచుకొని తిరుగులేని ఆధిక్యతను ను సాధించి మొదటి సరిగా మొదటి కార్పొరేషన్ పై గులాబీ జెండాను ఎగరవేసింది. కాంగ్రెస్ కూడా 10 డివిజన్లలో గెలిచినప్పటికీ ముగ్గురు మినహా మిగతా ఏడుగురు ఎన్నికలు అయిన కొద్దీ కాలానికే గులాబీ కండువా కప్పుకున్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు టీఆర్ యస్ లో చేరారు. దీంతో టీఆర్ యస్ బలం 43 కు చేరింది . గత ఎన్నికల సందర్భంగా పువ్వాడ అజయ్ కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచి అప్పుడు టీఆర్ యస్ పై గట్టి పోటీ నిచ్చారు. తరువాత అయిన టీఆర్ యస్ లో చేరారు . 2018 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ టికెట్ ను కాంగ్రెస్ పొత్తుల్లో భాగంగా తెలుగుదేశానికి కేటాయించింది. దీంతో కాంగ్రెస్ కు మద్దతుగా ఉండే పెద్దదిక్కు లేకుండా పోయింది . మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు టీఆర్ యస్ నుంచి కాంగ్రెస్ లో చేరి ఖమ్మం టికెట్ ఆశించారు . టీడీపీ తో పొత్తులో భాగంగా ఆయనకు టికెట్ దక్కలేదు. కాంగ్రెస్ పొత్తుతో టీడీపీ తరుపున పోటీచేసిన నామ నాగేశ్వరరావు ఖమ్మం అసెంబ్లీకి పోటిచేసి ఓడిపోయారు. తరువాత లోకసభ ఎన్నికల సందర్భంగా టీఆర్ యస్ లో చేరి ఖమ్మం లోకసభకు పోటీచేసి ఎంపీ అయ్యారు.అందువల్ల కాంగ్రెస్ కు బలం ఉన్న దాన్ని ఆర్గనైజ్ చేసే నాధుడు లేక డీలాపడి ఉంది. ఉన్నంతలో కాంగ్రెస్ కు బలమైన నేతగా ఉన్న పోట్ల నాగేశ్వరరావు సతీమణి పోట్ల మాధవిని మేయర్ అభ్యర్థిగా పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇటీవల కొంత గ్రౌండ్ వర్క్ చేస్తుంది. టీఆర్ యస్ ఖమ్మం నగర అభివృద్ధిపై కేంద్రీకరించింది. మంత్రి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ నిరంతరం నగరంలో తిరుగుతు స్వయంగా అభివృద్ధి పనునులను పర్వవేక్షేస్తూ పరుగులు పెట్టిస్తున్నారు .మేయర్ అభ్యర్థిగా ఈ సారి వైశ్యుల నుంచి ఎంపిక చేయాలనీ మంత్రి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ దిశగా వైశ్యులలో కూడా చర్చ జరుగుతుంది. ఇటీవల వైశ్యుల సమావేశం కూడా జరిగింది. రాజకీయంగా వారికీ ఆవకాశం కలిపించే ఆలోచనలో మంత్రి ఉన్నందున వారు కార్పొరేషన్ ఎన్నికల్లో కీలకం కానున్నారు. కులాల వారీగా డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థులను అన్ని పార్టీలు ఎంపిక చేయనున్నాయి . ఖమ్మంలో బీసీలు బలమైన సెక్షన్ ఉన్నప్పటికీ అనేక కులాలలో ఉన్నారు. బలమైన ఓటు బ్యాంకు గా మున్నూరు కాపులు , వైశ్యులు , కమ్మ , పద్మశాలి ,బ్రాహ్మణులు ముదిరాజ్ లు , యాదవులు , గౌడ్ లు , ముస్లింలు , క్రిస్టియన్లు , ఎస్సీల ఉన్నారు. కులాల పాత్ర కూడా ఎన్నికల్లో ప్రముఖంగానే ఉంటుంది. ఇప్పటికే కొన్ని కులాలు రాజకీయాల్లో తమ వాటా కోసం డిమాండ్ చేస్తున్నాయి. కులసంఘాలు ఉన్నాయి. బీసీ సంఘాలు ఉన్నాయి. స్తానిక ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల కన్నా స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉంటాయి. అందువల్ల అన్ని పార్టీలు ఆదిశగా కుస్తీ పడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైయ్యాయి. మేయర్ సీటు జనరల్ మహిళకు కేటాయించారు. అందువల్ల పోటీ రసవత్తరంగా ఉండే ఆవకాశం ఉంది.

Related posts

తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు …..

Drukpadam

తిరుమల నడకదారుల్లో విక్రేతలకు టీటీడీ తాజా మార్గదర్శకాలు…

Ram Narayana

ఇప్పటికే 87 పెళ్లిళ్లు.. 61 ఏళ్ల వయసులో 88వ వివాహానికి రెడీ అవుతున్న ‘ప్లేబోయ్’

Drukpadam

Leave a Comment