Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఈటల కబ్జా నిజమే మెదక్ కలెక్టర్ ….

ఈటల రాజేందర్ కు చెందిన జమునా హేచరీస్ సంస్థ భూములను కబ్జా చేసింది: మెదక్ జిల్లా కలెక్టర్
56 మంది అసైనీ భూములను కబ్జా చేశారు
70.33 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసినట్టు సర్వేలో తెలిసింది
హేచరీస్ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నట్టు గుర్తించాం

ఈటల రాజేందర్ పై ప్రభుత్వం మోపిన భూకబ్జా ఆరోపణలు నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ తెలపటం సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఒక్క అంగుళం భూమికూడా తమ కబ్జా లేడని ఈటల కుటంబం చెబుతూ వచ్చింది. దీనిపై రాష్ట్రలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది.దీంతో రంగంలోకి దిగిన అధికారులు స్వయంగా జిల్లా కలెక్టర్ కబ్జా వ్యవహారం నిజమేనని చెప్పడం పై ఆశక్తి నెలకొన్నది . దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. ఈటల స్టెప్స్ ఏ విధంగా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది.

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరిస్ అసైన్డ్ భూములను కబ్జా చేసిన సంగతి నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. 56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్టు సర్వేలో తేలిందని చెప్పారు. హకీంపేట, అచ్చంపేట పరిధిలో 70.33 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారని సర్వేలో వెల్లడయిందని అన్నారు. జమునా హేచరీస్ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసిందని చెప్పారు. అసైన్డ్ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారని, పెద్దపెద్ద షెడ్లను నిర్మించారని తెలిపారు.

జమునా హేచరీస్ సంస్థ వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీప్రాంతంలో చెట్లను నరికి రోడ్లు వేసిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. హేచరీస్ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నట్టు గుర్తించామని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వానికి కూడా నివేదిక అందిస్తామని తెలిపారు.

Related posts

వామ్మో రాజు నీ వెనక ఇంత కథ ఉందా? రుణాలు వేగవేసి నీతులు చెబుతున్నావా?

Drukpadam

ఆ ఇద్దరూ ఒకరు కాదు… మెహుల్ చోక్సి భార్య ప్రీతి స్పష్టీకరణ…

Drukpadam

లఖింపూర్ ఖేరి ఘటన పక్కా ప్రణాళికతో జరిగింది: కోర్టుకు వెల్లడించిన సిట్

Drukpadam

Leave a Comment