హైద‌రాబాద్‌లో మ‌రో దారుణ ఘ‌ట‌న‌.. బాలిక అనుమానాస్ప‌ద మృతి!

హైద‌రాబాద్‌లో మ‌రో దారుణ ఘ‌ట‌న‌.. బాలిక అనుమానాస్ప‌ద మృతి!
-మియాపూర్‌లో ఘ‌ట‌న‌
-నిన్న 13 నెల‌ల పాప అదృశ్యం
-క‌ళ్లు పీకేసి చంపేసిన వైనం
-12 ఏళ్ల‌ బాలుడిపై త‌ల్లిదండ్రుల ఆరోప‌ణ‌లు

హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఆరేళ్ల బాలిక హ‌త్యోదంతం మ‌ర‌వ‌క‌ముందే న‌గ‌రంలో మ‌రో విషాద ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మియాపూర్‌లో నిన్న ఉదయం అదృశ్యమైన 13 నెల‌ల ఓ బాలిక మృత‌దేహం ఇంటి స‌మీపంలో ల‌భ్య‌మైంది. పాత ఇనుప సామ‌గ్రి, ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుని అమ్మి, జీవించే ఆ బాలిక‌ తల్లిదండ్రులు బాలిక‌ను పక్కింట్లో వదిలి నిన్న ఉద‌యం ప‌నుల‌కు వెళ్లారు.

తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వ‌చ్చేసరికి బాలిక కనిపించలేదు. దీంతో త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో కేసు నమోదు చేసుకున్న‌ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాలిక మృతిపై అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆ పాప మృత‌దేహం ఇంటి స‌మీపంలో ఖాళీ స్థ‌లంలో క‌న‌ప‌డింది. ఆ పాప కళ్లు పొడిచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కాగా, తల్లిదండ్రులు చెబుతోన్న‌ వివరాల్లో స్పష్టత లేద‌ని పోలీసులు అంటున్నారు. త‌ల్లిదండ్రుల‌ను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి ప్ర‌శ్నిస్తున్నారు. ఓ గుర్తు తెలియని 12 ఏళ్ల బాలుడు నిన్న సాయంత్రం త‌మ‌ పాపను తీసుకెళ్లినట్లు త‌ల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. అనంత‌రం ఆ బాలుడు కూడా అదృశ్యమైనట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. బాలిక మృత‌దేహాన్ని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.


వినాయ‌క చ‌వితి రోజున హైద‌రాబాద్‌ న‌గ‌ర న‌డిబొడ్డున ఈ దారుణ ఘ‌ట‌న జ‌రిగింది: ఎమ్మెల్యే సీత‌క్క‌
సైదాబాద్‌లో ఆరేళ్ల‌ బాలిక హ‌త్యోదంతంపై సీత‌క్క ఆగ్ర‌హం
బాలిక‌ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే
ఘ‌ట‌నపై ఇప్ప‌టికీ ప్ర‌భుత్వం స్పందించ‌లేదని మండిపాటు
కాసేప‌ట్లో బాలిక ఇంటికి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌లోని సైదాబాద్‌లో ఇటీవ‌ల ఆరేళ్ల‌ బాలిక తాము ఉంటోన్న ప‌క్కింటి ఇంట్లో విగ‌త‌జీవిగా క‌న‌ప‌డిన విష‌యం క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఆ కుటుంబాన్ని ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క ప‌రామ‌ర్శించారు. వినాయ‌క చ‌వితి రోజున న‌గ‌ర న‌డిబొడ్డున ఈ దారుణ ఘ‌ట‌న జ‌రిగిందని, ఈ ఘ‌ట‌నపై ఇప్ప‌టికీ ప్ర‌భుత్వం స్పందించ‌లేదని ఆమె విమ‌ర్శించారు.

సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇప్ప‌టికీ స్పందించ‌క‌పోవ‌డం ఏంటని సీత‌క్క నిల‌దీశారు. నిందితుడిపై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతుతన్నాయ‌ని, నిందితుడికి గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్న‌ట్లు తెలుస్తోందని ఆమె చెప్పారు.

గిరిజ‌న బిడ్డ‌కు జ‌రిగిన అన్యాయంపై ప్ర‌భుత్వం స్పందించ‌డం లేదని సీత‌క్క మండిప‌డ్డారు. ఎమ్మెల్యేలు కూడా మాట్లాడ‌క‌పోవ‌డం ప్ర‌భుత్వ తీరుకు నిద‌ర్శ‌నమ‌ని, ఘ‌ట‌నాస్థ‌లికి అధికారుల‌ను పంపి చేతులు దులుపుకుంటున్నారని ఆమె విమ‌ర్శించారు. కాగా, కాసేప‌ట్లో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి బాధిత బాలిక కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు.

Leave a Reply

%d bloggers like this: