Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాళ్లను సేకరించడం నేరమైంది ….బ్రిటిషర్ కు ఇరాన్ లో మరణశిక్ష!

రాళ్లను సేకరించడం నేరమైంది ….బ్రిటిషర్ కు ఇరాన్ లో మరణశిక్ష!
-12 రాళ్లను సేకరించడమే తప్పయిపోయింది…
-మరణశిక్షను ఎదుర్కొంటున్న 66 ఏళ్ల జిమ్ ఫిట్టన్
-ఓ పురావస్తు క్షేత్రాన్ని సందర్శించిన జిమ్ ఫిట్టన్
-అక్కడ కొన్ని ప్రాచీన రాళ్ల సేకరణ
-బాగ్దాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు

ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాల్లో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతర దేశాల్లో సాధారణ శిక్షలు విధించే నేరాలకు ఆయా ఇస్లామిక్ దేశాల్లో మరణశిక్షలు విధిస్తుంటారు. తాజాగా ఇరాక్ లో ఓ బ్రిటీష్ జాతీయుడు కూడా అలాగే నేరం రుజువైతే మరణశిక్షను ఎదుర్కొంటాడు.

అతడి పేరు జిమ్ ఫిట్టన్. 66 ఏళ్ల ఫిట్టన్ ఓ రిటైర్డు జియాలజిస్టు. జర్మనీకి చెందిన సహచర భూగర్భ శాస్త్ర నిపుణుడు వోల్కెర్ వాల్డ్ మాన్ తో కలిసి జిమ్ ఫిట్టన్ ఇరాక్ లోని ఎరిదు ప్రాంతంలో ఉన్న ఓ పురావస్తు క్షేత్రాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా ఆ పురావస్తు కేంద్రం నుంచి గుర్తుగా 12 పురాతన రాళ్లను, కొన్ని కుండలు, జాడీలకు చెందిన పెంకులను సేకరించారు. అయితే, అదే వారు చేసిన తప్పయింది.

తమ పురావస్తు సంపదను ఆ పాశ్చాత్యులు అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఇరాక్ అధికారులు వారిని మార్చి 20న బాగ్దాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. వారిద్దరినీ నిన్న ఇరాక్ కోర్టులో హాజరుపరిచారు. పోలీసు నిర్బంధంలో ఉన్నవారికి ఇచ్చే పసుపు రంగు దుస్తులను వారిరువురు ధరించారు.

తాము ఎలాంటి నేరపూరిత ఉద్దేశాలతో ఆ రాళ్లను సేకరించలేదని ఆ జియాలజిస్టులు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్యానల్ ముందు మొరపెట్టుకున్నారు. తమకు ఇరాకీ చట్టాల గురించి తెలియదని వాపోయారు. ఆ సమయంలో పురావస్తు క్షేత్రం వద్ద తమను హెచ్చరించేందుకు ఎవరూ లేరని, అక్కడ ఎలాంటి సందేశాలతో కూడిన బోర్డులు కూడా లేవని జిమ్ ఫిట్టన్ న్యాయమూర్తికి నివేదించారు.

తాను ఓ జియాలజిస్టు కావడం వల్ల ప్రపంచంలో ఏ పురావస్తు క్షేత్రాన్ని సందర్శించినా, అక్కడి నుంచి కొన్ని వస్తువులు సేకరిస్తుంటానని, అయితే, వాటిని అమ్మాలన్న ఉద్దేశం తనకు ఎప్పుడూలేదని వివరణ ఇచ్చారు. కాగా, ఇరాక్ లో ఈ మాత్రం నేరం మరణశిక్షకు అర్హమైనది కావడంతో జిమ్ ఫిట్టన్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఇరాకీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో, కుమార్తె పెళ్లిని కూడా చూడలేకపోయాడని అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కాగా, జిమ్ ఫిట్టన్ ను విడుదల చేసేలా ఇంగ్లండ్ ప్రభుత్వం చొరవ చూపాలంటూ ఆయన అల్లుడు శామ్ టాస్కర్ ఆన్ లైన్ లో పిటిషన్ ప్రారంభించారు. ఈ పిటిషన్ కు ఇప్పటివరకు 1.24 లక్షల మంది సంతకాల రూపంలో తమ మద్దతు తెలియజేశారు.

బాత్ ఎంపీ వెరా హాబ్ హౌస్ ఇంగ్లండ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇంగ్లండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫిట్టన్ ప్రాణాలను గాలికొదిలేసిందని ఆరోపించారు. అందుకు, ఓ మంత్రి బదులిస్తూ, మరణశిక్ష అంశంపై తమ ఆందోళనలను ఇరాకీ ప్రభుత్వానికి తెలియజేశామని స్పష్టం చేశారు.

Related posts

కెన్యాలో పాకిస్థాన్ జర్నలిస్ట్ అర్షద్ షరీఫ్ కాల్చివేత!

Drukpadam

జులై మాసంలో జీఎస్టీ వసూళ్ల వివరాలు తెలిపిన కేంద్రం…

Drukpadam

మీడియాపై విశ్వాసం కోల్పోరాదు-మంత్రి నిరంజన్ రెడ్డి

Drukpadam

Leave a Comment