డ్రైవర్ కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు.. !

డ్రైవర్ కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు.. !

  • మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో రోడ్డు ప్రమాదం
  • బస్సు ఢీకొట్టడంతో ఓ వృద్ధుడి మృతి.. పలువురికి గాయాలు
  • గుండెపోటుతో సీట్లోనే కన్నుమూసిన బస్సు డ్రైవర్

డ్రైవర్ గుండెపోటుతో సీటులోనే వాలిపోవడంతో బస్సు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన బైక్ లు, ఆటో, కార్లను ఢీకొట్టిన బస్సు కొద్ది దూరం వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో వృద్ధుడు చనిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జబల్ పూర్ లోని ఓ సిగ్నల్ వద్ద ఆగిన వాహనాలపైకి సిటీ బస్సు ఒకటి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. రెడ్ సిగ్నల్ పడడంతో ఆగిన ద్విచక్ర వాహనదారులు, ఒక ఆటో రిక్షాతో పాటు కారును ఢీ కొట్టిందన్నారు. ద్విచక్రవాహనాలను ఈడ్చుకుంటూ కొద్దిదూరం వెళ్లిన తర్వాత బస్సు ఆగిపోయింది. బస్సు వేగం తక్కువగా ఉండడం, ఢీ కొట్టినప్పుడు పక్కకు పడడంతో ఆరుగురు వాహనదారులు గాయాలతో బయటపడ్డారు. తీవ్రగాయాలైన ఓ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గుండెపోటుకు గురైన బస్సు డ్రైవర్ కూడా స్పాట్ లోనే చనిపోయాడని పోలీసులు వివరించారు.

Leave a Reply

%d bloggers like this: