Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మంలో అట్టహాసంగా కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి నామినేషన్

  • మంత్రులు తుమ్మల, పొంగులేటి,ఎంపీ రేణుకా చౌదరి తో కలిసి కలెక్టరేట్ కు
  • నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వామపక్షాలు
  • కార్యక్రమానికి హాజరు కానీ డిప్యూటీ సీఎం భట్టి
  • వందలాదిగా కదిలొచ్చిన కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ( ఆర్ ఆర్ ఆర్ )నామినేషన్ కార్యక్రమం హాట్టహాసంగా జరిగింది … చివరి క్షణం వరకు ఎవరికీ ఇస్తారో అని ఉగిసలాడిన కాంగ్రెస్ టికెట్ త్రీబుల్ ఆర్ కు ఇవ్వడంతో పొంగులేటి అనుయాయుల్లో జోష్ పెరిగింది …ప్రచారానికి కొద్దీ రోజులే సమయం ఉండటంతో ప్రతిక్షణం తమకు విలువైందనే భావనలో రఘురాంరెడ్డి ఉన్నారు …అందుకు అనుగుణంగా తమ ప్రచార కార్యకరం రూపొందించుకోనున్నారు …

గురువారం నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున రఘురాంరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల , పొంగులేటి , రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ,ఎమ్మెల్యేలు , రామదాస్ నాయక్ , డాక్టర్ మట్టా రాగమయి …జారే ఆదినారాయణ , కోరం కనకయ్య , పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు , సిపిఎం రాష్ట్ర నాయకులూ పోతినేని సుదర్శన్ , నున్న నాగేశ్వరావు , సిపిఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, పోటు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు …అంతకు ముందు కాల్వ ఒడ్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు …ఓపెన్ టాప్ వాహనంలో అభ్యర్థి తోపాటు నేతలు పాల్గొని ప్రజలకు అభివాదం చేశారు … ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఈర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నాయి .

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు అయ్యాక తొలిసారిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తో కలిసి ఖమ్మం రాగా ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల నుంచి రఘురాం రెడ్డికి ఘనస్వాగతం లభించింది … స్వాగత కార్యక్రమంలో కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి…

కాల్వొడ్డు నుంచి కలెక్టరేట్ కు ఆటో, బైకులతో ప్రదర్శన..నగరంలోని కాల్వొడ్డు నయాబజార్ కళాశాల నుంచి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రఘు రాం రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు రేణుక చౌదరి, కాంగ్రెస్ శాసన సభ్యులు, కొత్తగూడెం సీ పీ ఐ ఎమ్మెల్యే సాంబశివరావు , సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ , పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువాళ్ళ దుర్గ ప్రసాద్ తో కలిసి తో కలిసి కొత్త కలెక్టరేట్ వరకు ర్యాలీ గా వచ్చారు. ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లలో వందలాదిగా తరలి వచ్చారు. అనంతరం కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ కు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జావేద్ , మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, మువ్వా విజయ బాబు, తుళ్ళూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరు కానీ డిప్యూటీ సీఎం భట్టి

జిల్లాకు చెందిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు …అయితే హైద్రాబాద్ గాంధీ భవన్ లో జరిగిన బీజేపీ పై ఛార్జ్ షీట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇంచార్జి దీపదాస్ మున్షి తో కలిసి ఆయన పాల్గొన్నారు …దీనివల్లనే ఆయన హాజరు కాకపోయిఉండవచ్చునని తెలుస్తుంది …. టికెట్ ఆశించించి ఇప్పటికే నామినేషన్లు వేసిన పోట్ల నాగేశ్వరరావు , రాయల నాగేశ్వరరావు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం గమనార్హం….

Related posts

అధిష్టానం వద్ద ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ పంచాయతీ…

Ram Narayana

ఎన్నికల తర్వాత సైకోలకోసం ఖమ్మంలో పిచ్చి ఆసుపత్రి ..మంత్రి పువ్వాడ హాట్ కామెంట్స్ !

Ram Narayana

కొత్తగూడెంలో వనమా గెలుపు కోసం ఎంపీ వద్దిరాజు బుల్లెట్ పై హల్చల్

Ram Narayana

Leave a Comment