Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు పార్లమెంట్ లో పెట్టాలని న్యాయశాఖ మంత్రిని కలిసిన ఎంపి వద్దిరాజు…

కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసిన ఖమ్మం బార్ ప్రతినిధులు

  • ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేత.

న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును పార్లమెంటులో తక్షణమే ప్రవేశ పెట్టాలని ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు తాళ్లూరి దిలీప్, కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజును కోరారు. ఈ మేరకు వారు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, రక్షణ చట్టం ఆవశ్యకత గురించి న్యాయవాదులతో కలిసి ఎంపీ రవిచంద్ర కూడా కేంద్ర మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన కిరణ్ రిజుజు విషయాన్ని పరిశీలిస్తామని
హామీ ఇచ్చారు. న్యాయవాద రక్షణ చట్టం బిల్లుపై రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీసుకున్న చొరవ పట్ల న్యాయవాదులు దిలీప్, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు.. కేంద్ర మంత్రి రిజుజు కు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

Here Are 5 Ways You Can Get Younger-looking Skin Right Now

Drukpadam

రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోదీకి జగన్ మద్దతు ఇస్తున్నారు: శైలజానాథ్

Drukpadam

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం…

Drukpadam

Leave a Comment