Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ ,బీజేపీ లమధ్య డ్రామానా ?రైతులకోసం కదా ?

టీఆర్ యస్ ,బీజేపీ లమధ్య డ్రామానా ?రైతులకోసం కదా ?
పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ యస్
కేంద్రంపై పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారు: టీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఆగ్రహం
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి
హుజూరాబాద్ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్య
కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం
కేంద్రం రైతులకు అన్యాయం చేయదని స్పష్టీకరణ
రైతుల వరిధాన్యం కొనిగొలుపై కేంద్రం స్పందన లేదని టీఆర్ యస్ విమర్శ
అందుకే పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించామని స్పష్టం చేసిన టీఆర్ యస్
టీఆర్ యస్ కు వేరే ఎజండా ఉందన్న బీజేపీ
హుజురాబాద్ ఎన్నికల ఓటమిని టీఆర్ యస్ జీర్ణించుకోలేక పోతుందని వాఖ్య

తెలంగాణ రాష్ట్రంలో రైతుల వద్దనుంచి వరిధాన్యం కొనుగోళ్ల విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కాస్త పార్లమెంట్ కు చేరింది. గతవారం రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో వరిధాన్యం కొనే విషయం కేంద్రం స్పష్టత ఇవ్వాలని టీఆర్ యస్ సభ్యులు వాకౌట్ చేస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ,అంబెడ్కర్ విగ్రహం ముందు బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే కేంద్రం ప్రతిరోజూ ఎదో ఒక ప్రకటన చేయాడం పరిపాటిగా మారింది తప్ప చర్యలు సూన్యం అయ్యాయి. దీంతో మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా బహిష్కరించాలని నిర్ణయించాయి. ఇది రెండు పార్టీలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు .

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపును టీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని అన్నారు. కేంద్రంపై పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, ఇప్పుడు దాన్ని పెను సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఒప్పందం ప్రకారం రా రైస్, బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం చెబుతోందని, రైతులకు కేంద్రం అన్యాయం చేయదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ, కేంద్రంపై కేసీఆర్ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ తీరు చూస్తుంటే కిసాన్ బచావో అన్నట్టుగా లేదు, కేసీఆర్ బచావో అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని, రైతుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు నష్టం చేసే చర్యలు వద్దని హితవు పలికారు.

Related posts

మంత్రి హరీష్ రావు కు కీలక భాద్యతలు….?

Drukpadam

కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ వస్తాయి…..రేవంత్ రెడ్డి

Drukpadam

తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం మార‌బోతోంది: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment