Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నల్లగొండ జిల్లాలో ధ్యానం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన గవర్నర్ తమిళశై!

నల్లగొండ జిల్లాలో ధ్యానం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన గవర్నర్ తమిళశై!
-దుప్పల పల్లి, అర్జాల బావి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన
-రైతులకు అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్న గవర్నర్
-ధాన్యం కొనుగోలు తీరుపై గవర్నర్ ఆరా ?

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళశై ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు రాష్ట గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆమె రెండు ముఖ్యమైన కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడ పలువురు రైతులతో ముచ్చటించారు. దుప్పల పల్లి, అర్జాల బావి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతున్న కేంద్రాలకు వెళ్లిన గవర్నర్ అక్కడ కొనుగోలు విధానం, కొనుగోళ్లతీరు, అక్కడ రైతులకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. రైతులకు అందుతున్న సౌకర్యాలు , ఇతర ఇబ్బందులను గురించి రైతులను గవర్నర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాలలో రైతులు పెద్ద ఎత్తున గుమికూడి తమ సమస్యలను వివరించారు. కల్లాలలో ధాన్యం కొనుగోళ్లు పై ఆరా తీశారు.

ఈ సందర్భంగా గవర్నర్ రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం తరపున సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ వారిని అడిగారు. అలాగే పంట ఎంత వచ్చింది, ధాన్యాన్ని నింపడానికి అవసరమైన బ్యాగుల లభ్యత గురించి అడిగారు.ఈ సందర్భంగా అధికారులు కొనుగోలుకేంద్రాల తీరుపై గవర్నర్కు వివరించారు. సేకరణ విధానం, సౌకర్యాల కల్పన వంటి వాటిని వివరించారు. అంతకు ముందు గవర్నర్ నల్గొండ జిల్లా షేర్ బంగ్లా ప్రాంతంలో భక్తాంజనేయ సహిత సంతోషిమాతా దేవాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related posts

అప్పుల రాష్ట్రంగా తెలంగాణ…సీఎల్పీ నేత భట్టి ధ్వజం

Drukpadam

మహిళా అధికారికి అదే తొలిపోస్టింగ్.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన వైనం

Drukpadam

యాసంగి ధాన్యం పండించిన రైతులకు కేసీఆర్ భరోసా …

Drukpadam

Leave a Comment