Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

క్రాస్ బ్రీడ్​లు వస్తుంటాయ్ పోతుంటాయ్.. కానీ తెరాస వాళ్లంతా ఒరిజినల్ బ్రీడ్స్’:మంత్రి పువ్వాడ!

క్రాస్ బ్రీడ్​లు వస్తుంటాయ్ పోతుంటాయ్.. కానీ తెరాస వాళ్లంతా ఒరిజినల్ బ్రీడ్స్’:మంత్రి పువ్వాడ!

-ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుత విజయం ఖాయం
-తాతా మధుకు భారీ మెజార్టీ వస్తుంది
-ఎన్నిక ఏదైనా విజయం టీఆర్ యస్ దే
-సహకరించిన వారందరికీ ధన్యవాదాలు
-కేసీఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం
-ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అడ్డగోలుగా వ్యవహరిస్తోంది
-రైతులతరుపున ఉద్యమం చేసిన ఘనత టీఆర్ యస్ దే

 

తెరాస అంటేనే ఒరిజినల్ బ్రీడ్ అని.. ఎన్ని క్రాసింగ్​లు జరిగినా.. క్రాస్ బ్రీడ్​లు వచ్చినా..తెరాస అంటేనే ఒరిజినల్ బ్రీడ్..   మా విజయంతోనే సమాధానమిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ యస్ అద్భుత విజయం సాదిస్తుందని అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా టీఆర్ యస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఎంపీ నామా నాగేశ్వరరావు , ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ యస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తాతా మధుకు భారీ మెజార్టీ ఖాయమని అన్నారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ యస్ కు 500 పైగా ఓట్లు ఉన్నాయని అందువల్ల గెలుపు నల్లేరు మీద నడకేనన్నారు.ఖమ్మం జిల్లాలో ఏ ఎన్నికలు నిర్వహించినా గెలుపు తెరాస పార్టీదే గెలుపని, శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో విజయం కూడా తెరాస పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని ఎంపీ నామా నాగేశ్వరరావు ,టీఆర్ యస్ శాసనసభ్యులు ,ప్రజాప్రతినిధులు ఈ గొలుపులో భాగస్వాములు అయ్యారని అన్నారు. అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయం. తెరాస విజయానికి పనిచేసిన అందరికి కృతజ్ఞతలు. భారీ మెజార్టీతో తెరాస విజయం సాధిస్తోంది. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తాతా మధుకి వచ్చే విజయం ద్వారా ప్రతిపక్షాలకు సమాధానం చెప్తాం. అలాంటి ఇలాంటి మెజార్టీ కాదు. భారీ మెజార్టీ సాధిస్తాం. ఏ క్రాసింగైనా.. క్రాస్ బ్రీడ్​ అయినా వస్తుంటాయ్.. పోతుంటాయి. మాది అంతా ఒరిజినల్ బ్రీడ్. తెరాస అంటేనే ఒరిజినల్ బ్రీడ్. తెరాస విజయం పట్ల మాలో ఎలాంటి అభద్రతా భావం లేదు.

ధాన్యం పండించిన రైతులకు నిరీక్షణ .

తెలంగాణపై ఎఫ్‌సీఐ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు.  ధాన్యం కొనుగోలు విషయంలో ఎఫ్​సీఐ విధానం సరిగా లేదని మంత్రి పువ్వాడ అజయ్‌ ఆరోపించారు. తెలంగాణపై ఎఫ్‌సీఐ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. సింగరేణిలోని బ్లాక్స్ వేలం వేయటాన్ని సింగరేణి తరఫున, తెరాస పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను కేంద్రం ఇంకా ప్రారంభించకపోడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు.దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై కక్షసాధింపు చర్యలు ఎందుకని ప్రశ్నించారు.
వరి కోతలు ప్రారంభమై పంట చేతికొస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులను ఆందోళకు గురిచేస్తోందన్నారు.ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోతలు ప్రారంభమై ధాన్యం ఇళ్లకు చేరుతున్నాయని అన్నారు.

ఉభయ జిల్లాల్లో వారం రోజుల క్రితం నుంచే రైతులు వరి కోతలు ప్రారంభించారని కానీ కేంద్రానికి మాత్రం ఆ ధాన్యాన్ని కొనాలన్న ఆలోచన లేకపోయిందని విమర్శించారు రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనాలని డిమాండ్ చేశారు.

తమిళనాడులో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తో పాటు వారి సతీమణి మరో 11 మంది మరణించడం బాధాకరమన్నారు. బిపిన్ రావత్ గారి మరణం దేశానికి తీరని లోటని, ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం 2నిమిషాల పాటు మౌనం పాటించారు.

సమావేశంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డిసిసిబి ఛైర్మన్ కురాకుల నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ , సూడా చైర్మన్ విజయ్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి ఆర్జేసీ కృష్ణ , రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. .

Related posts

ప‌నిచేసే వారికే పార్టీ టికెట్లు… కాంగ్రెస్ నేత‌ల‌కు తేల్చిచెప్పిన రాహుల్!

Drukpadam

పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలపై కపిల్ సిబాల్ వ్యాఖ్యలు …ఆయన ఇంటిపై యువజన కాంగ్రెస్ కార్యకర్తల టమాటాలు దాడి…

Drukpadam

కాంగ్రెస్‌కు షాక్.. టీఎంసీ గూటికి టీమిండియా మాజీ క్రికెటర్

Drukpadam

Leave a Comment