Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోడీగారు గుజరాత్ కో న్యాయం…తెలంగాణ కో న్యాయమా!…సండ్ర

మోడీగారు గుజరాత్ ఒక న్యాయం …తెలంగాణ ఒక న్యాయమా ?…ఎమ్మెల్యే సండ్ర
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం పక్షపాతం ..రైతులపాలిట శాపం
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తున్న మోడీ
సింగరేణిలో కేంద్రం తమ వాటా అమ్మితే తెలంగాణ ప్రభుత్వం కొనేందుకు సిద్ధం
బొగ్గుగనుల వేలం ఆపకపోతే ఉద్యమం ఉదృతం

కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం టీబీజీకేఎస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు, రైల్వే, సింగరేణిని కార్పొరేట్‌ సంస్థలకు అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌కో న్యాయం, తెలంగాణకో న్యాయం చూపుతున్నారని ఆరోపించారు.

బొగ్గు బావులు, ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్‌పరమైతే వేల మంది ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు. సింగరేణి ద్వారా గ్రామాల అభివృద్ధికి వచ్చే నిధులు ఆగిపోతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిలోని తమ వాటాను అమ్మితే తెలంగాణ ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారన్నారు. దేశంలో 125ఏళ్ల చరిత్రగల సింగరేణి రూ.వేలకోట్ల లాభాలను తెచ్చిపెడుతున్నదని, దీన్ని ప్రైవేట్‌పరం చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందన్నారు. మూడ్రోజులపాటు కార్మికులు చేసిన సమ్మెకు అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని సంఘాలు మద్దతు తెలిపాయని అన్నారు. బొగ్గుబావుల వేలాన్ని నిలిపివేయకుంటే కార్మికుల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇప్పటికే బొగ్గు కొరత ఏర్పడి అనేక ఇప్పటికే రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు తీవ్రతరమవుతున్నాయని,దీన్ని అధిగమించేందుకు బొగ్గు ఉత్పత్తి చాలా అవసరమన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని మోడీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోకపోతే ఫలితం అనుభవించక తప్పాయన్నారు.

సమావేశంలో టీబీజీకేఎస్‌ నాయకులు జేఎస్‌ఆర్‌ మూర్తి, మాధవరెడ్డి, రాంబాబు, ఉపేంద్రాచారి, సుబ్బారెడ్డి, సత్యనారాయణరెడ్డి, యూసఫ్‌, శ్రీధర్‌, శ్రీను, హజ్‌గర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, రఫీ, అద్దంకి అనిల్‌, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ అందాల రాణి!

Drukpadam

తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న ఈటల మాటలు…

Drukpadam

100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్.. ఖమ్మం బీఆర్ఎస్ సభకు భారీ ఏర్పాట్లు!

Drukpadam

Leave a Comment