Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పవన్ కళ్యాణ్ బీజేపీ తో కొనసాగటం పై సందేహాలు… ?

పవన్ కళ్యాణ్ బీజేపీ తో కొనసాగటం పై సందేహాలు… ?
-తిరుపతిలో పోటీకి పై పునరాలోచనలో పడ్డారా ?
-జనసైనికులు అడుగులు ఎటు వైపు
-ఒంటరిగానే వెళ్లాలనే ఆలోచనలకు పదును పెడతారా ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆశక్తిగా మారనున్నాయి అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు . నిన్న మొన్నటి వరకు బీజేపీ తో స్నేహం చేసేందుకు పరుగులు పెట్టిన కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయం ఉండగా ఇప్పుడు కొత్తగా విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య వచ్చి చేరింది. దీని పై బీజేపీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పేందుకు కలవర పడుతుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది . ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులపై అందరి దృష్టి పడింది. ఆయన బీజేపీతో స్నేహం కొనసాగిస్తారా ? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది .తిరుపతి పోటీకి సై అంటారా ? జనసైనికులు ఒంటరిగానే వెళ్లాలని అనుకుంటున్నారా ? వారి అడుగులు ఏటు వైపు అనేది ఆశక్తిగా మారింది. చేగువేరా ఆదర్శం అన్న పవన్, బీజేపీతో చేతులు కలపడం పై విమర్శలు ఉన్నాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా విషయంలోనూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీ కరణ విషయంలో బీజేపీ పై ఆంధ్రా ప్రజలు గుర్రుగా ఉన్నారు. దానితో బీజేపీ పై ఇంతకూ ముందు ఉన్న కొద్దో గొప్పో ప్రభలు తొలుగుతున్నాయి.
పవన్ మొదటి నుంచే వైసీపీ పై యుద్ధం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో లేని సమయంలో సైతం దాని పైనే పవన్ విమర్శలు ఎక్కుపెట్టే వారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయటంలో తప్పులేదు. కాకపోతే ప్రతిదీ ప్రజావ్యతిరేకం అనుకుంటే ప్రజల్లో ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది అంచనా వేయటంలో వైఫల్యాలు ఉన్నట్లు జనసైనికుల్లోనే ఉంది . పవన్ ఒకసారి లెఫ్ట్ పార్టీలతో మరో సారి బీజేపీ తో జత కట్టడం పై విమర్శలు లేకపోలేదు. అయినా ఆయన వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. ముందు ఆయనకు మిత్రులు ,శత్రువులను అంచనావేయటంలో లోపం కనపడుతుంది . అందుకు ఆయన వేస్తున్న అడుగులు సరైన దారిలో ఉన్నాయా లేదా అని చూస్తే ఎందుకో సరైన దారిలో వెళ్ళటం లేదనే అభిప్రాయాలూ ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు ఆయన బీజేపీ పై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని పైగా ప్రధాని ఇక్కడకు వచ్చి రాష్ట్ర రాజధానికోసం చెంబేడు నీళ్లు , పాచిపోయిన లడ్డు ఇచ్చి పోయారని విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా దక్షాదికి అన్యాయం జరుగుతుందని , నిధుల విషయంలోనూ , అధికారాల విషయంలోనూ , చివరికి మంత్రివర్గంలో కూడా దక్షణాది పై చిన్నచూపు ఉందని ఆరోపణలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ దక్షణాది రాష్ట్రాలను ఏకం చేసి పెద్ద ఉద్యమాన్ని నడుపుతారని చాలామంది అనుకున్నారు. కానీ ఎన్నికల అనంతరం ఆయన ఒక్కసారిగా మారిపోయారు. దక్షణాది , ఉత్తరాది పక్కన పెట్టారు. బీజేపీతో స్నేహం చేసేందుకు నడుం బిగించారు. అమిత్ షా , జే పీ నడ్డా లను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు . తాను బీజేపీ తో కలిసి పని చేస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు సంబందించిన ఏ విషయాలపై వారితో చర్చించారు . రాష్ట్రానికి ఏమి లాభం చేస్తామని వారు హామీ ఇచ్చారనేది ఇంతవరకు వెల్లడించలేదు. ఇక తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి పెట్టిన జనసేనాని ముందే అక్కడ ప్రచారం నిర్వవించారు.ఢిల్లీకి వెళ్లి తిరుపతిలో తమపార్టీ నే పోటీచేస్తుందని చెప్పారు. కానీ అక్కడ పెద్దలు అంగీకరించలేదు. చివరకు పంచాయతీ ఎన్నికలు వచ్చాయి వాటిల్లో బీజేపీ , జనసేన పోటీచేశాయి. అనుకున్న విధంగా వారి మద్దతు దార్లు గెలవలేదు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో కాస్తోకూస్తో జనసేన మద్దతుదారులు గెలిచారు. దీంతో బీజేపీ తిరుపతి పార్లమెంట్ కు పోటీచేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు తమ పార్టీ పోటీచేస్తేనే పోటీఇవ్వగలం అని జనసేన అంటుంది. పంచాయతీ ఎన్నికలు , విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీ కరణ అంశం తెరపైకి వచ్చిన తరువాత బీజేపీతో కలిసి వెళ్ళటం పై జనసేన ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ యాత్రలు చేసినప్పటికీ తగిన విధంగా స్పందన లభించినట్లులేదు . దీంతో కేంద్ర నాయకులూ ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను అంచనాయటంలో విఫలమౌతున్నారని జనసేన భావిస్తుంది. అందుకే వారితో కలిసి వెళ్ళితే లాభం కన్నా నష్టం ఎక్కువగా జరుగుతుందని అభిప్రాయం తో ఉన్న జనసైనికులు బీజేపీ విషయంలో ఆలోచనలో పడ్డారా అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం ఏమి జరుగుతుందో …?

Related posts

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం పొలిటికల్ డ్రామాగా ఉంది: పవన్ కల్యాణ్

Drukpadam

కశ్మీరీ పండిట్ల వలసలకు నేనే కారణమని రుజువైతే.. నన్ను ఉరితీయండి: ఫరూఖ్ అబ్దుల్లా

Drukpadam

బెంగాల్ సీఎంగా మూడవసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌మ‌త బెన‌ర్జీ

Drukpadam

Leave a Comment