Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హక్కుల పరిరక్షణకు మానువాదాన్ని మట్టుబెట్టాలి

మాట్లాడుతున్న స్కైలబ్ బాబు


రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం మనువాదాన్ని మట్టుబెట్టాలి.
కెవిపిఎస్ ఖమ్మం సెమినార్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు

అంబేద్కర్ మహనీయుని ఆకాంక్ష రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరి దరి చేరాలంటే దానికి ఆటంకంగా ఉన్న మనువాదాన్ని సమైక్యంగా మట్టుబెట్టాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు
బుధవారం ఖమ్మం మంచికంటి హాల్ లో మనుస్మృతి వద్దు రాజ్యాంగమే ముద్దు అనే అంశం పై జరిగిన కెవిపిఎస్ జిల్లా స్థాయి సెమినార్ కు సంఘం జిల్లా కార్యదర్శి నందీపాటి మనోహర్ అధ్యక్షత వహించారు.
ముఖ్యవక్తగా పాల్గొన్న కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మూడు వేల సంవత్సరాలుగా మానసిక చట్టాలతో అత్యధికులను అన్ని అవకాశాలకు దూరం చేసిన మనుస్మృతి భారత రాజ్యాంగాన్ని కబాలించడానికి ఆర్ ఎస్ ఎస్ బీజేపీ రూపములో ప్రయత్నిస్తోందని విమర్శించారు రాజ్యాంగం రక్షించుకోవడం పౌర సమాజం సామాజిక బాద్యతగా స్వీకరించాలన్నారు. మతోన్మాద శక్తులు బీజేపీ అధికార అండతో పెట్రేగిపోయి దళితులు మహిళలపై దాడులు దౌర్జన్యాలకు హత్యలకు ఒడిగడుతున్నాయని చెప్పారు బీజేపీ యోగి పాలన రేపిస్టులకు అడ్డాగా మారిందన్నారు. హత్రాస్ బాధితురాలి తండ్రి ని జైలు నుండి బయటకు రావడంతోనే కాల్చిచంపడం వెనుక బీజేపీ అండదండలున్నాయని విమర్శించారు రాష్ట్రంలోని పచ్చని పల్లెల్లో బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాలకోసం దళిత బలహీన వర్గాల మధ్య తంపులు పెడుతుందన్నారు. శివాజీ విగ్రహాల పేరుతో బీజేపీ నేతలు బండి సంజయ్ అరవింద్ రాజాసింగ్ రెచ్చగొట్టే మాటలవల్లా కలిసే ఉండే పెదలమధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇటీవల గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవుమాంసం తినే లం.. కొడుకులు అంటూ భూతులు మాట్లాడడం బీజేపీ సంస్కృతి లో బాగమైతే బండి సంజయ్ జవాబు చెప్పాలన్నారు ఓ వైపు భారతమాతకు జై అంటూ మరో వైపు భారత నారిమణులను లంజలు అని మాట్లాడడం వారి సంస్కార హీనత కు నిదర్శనమని చెప్పారు ఇంకో సారి దళితులను కించపరిస్తే ఉపేక్షించబోమన్నారు. రాష్ట్రం హోంమంత్రి డిజిపి సుమోటోగా తీసుకొని ఎస్సి ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలన్నారు.
ఈ సదస్సు లో డి బి ఎస్ జిల్లా నాయకులు చేకూరి చైతన్య, బిసి సంఘం జిల్లా నాయకులు, పెరుగు వెంకటరమణ, మత్స్య సంఘం నాయకులు పగడాల నాగేశ్వర్ రావు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము శ్రీను, గంటా భీమయ్య, జిల్లా నాయకులు పగిడికత్తుల నాగేశ్వర్ రావు, పాపిట్ల సత్యనారాయణ, పి నాగరాజు, చాట్ల రాము, మట్టి దుర్గాప్రసాద్, ఎన్ చిరంజీవి, మాచర్ల గోపాల్, బండి శ్రీను, వెంకటరమణ, సుజాత, సరోజ వెంకటమ్మ, బిబి తదితరులు పాల్గొన్నారు.

Related posts

విటమిన్ సప్లిమెంట్లతో క్యాన్సర్?

Drukpadam

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో హడలెత్తిస్తున్న గొర్రె గేదెలు!

Drukpadam

కొత్త రకం బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా.. ప్రత్యర్థి దేశాల వెన్నులో వణుకు…

Drukpadam

Leave a Comment