Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజకీయాల గుడ్ బై… చిన్నమ్మ సంచలన ప్రకటన…

రాజకీయాల గుడ్ బై …చిన్నమ్మ సంచలన ప్రకటన…
ఇటీవలే జైలు నుంచి విడుదలైన శశికళ
మరికొన్ని వారాల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
ప్రకటన విడుదల చేసిన శశికళ
తానెప్పుడూ అధికారం, పదవులు కోరుకోలేదని వెల్లడి
జయ పార్టీ గెలవాలని ప్రార్థిస్తున్నట్టు వివరణ
ఇటీవలే జైలు నుంచి విడుదలైన చిన్నమ్మ అస్త్రసన్యాశం చేశారు. బెంగుళూరు జైలు నుంచి విడుదలైన తరువాత మొదటి సారిగా చెన్నై కి వచ్చిన ఆమెకు ప్రజలు భ్రమ్మ రథం పట్టారు.ఆమె బెంగుళూరు నుంచి చెన్నై వరకు ప్రయాణ దూరం 324 కి .మీలు 6 ఘంటలు పట్టాల్సిన సమయం 23 ఘంటలు పట్టింది . దీనికి 200 ఖర్చు అయిందని అంచనా . ఆమె వచ్చిన తరువాత రాజకీయాలు మారిపోతాయని , ఆమె అన్నా డీఎంకే ను అస్తగతం చేసుకుంటారని అనుకున్నారు. ఆమె అడుగులు ఎలా ఉండబోతున్నాయని రకరకాలుగా వార్తలు వచ్చాయి. కనే ఆమె తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన ఆశ్చర్యానికి గురి చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను అందలం ఎక్కించేందుకు కృషి చేస్తారని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు శశికళ సంచలనం నిర్ణయం తీసుకోవటం ఎవరికీ లాభం ఎవరికీ నష్టం అనే విషయం పై పరిశీలకులు సైతం ఒక అంచనాకు రాలేక పోతున్నారు. అయితే ఆమె త్వరలో జరగబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు కోసం మెరుపు .

“నేనెప్పుడూ అధికారంలో లేను. జయ బతికున్నప్పుడు కూడా నేను ఎలాంటి పదవుల్లో లేను. ఆమె చనిపోయిన తర్వాత కూడా అధికారం చేపట్టాలని, పదవిని అధిష్ఠించాలని కోరుకోలేదు. ఇప్పుడు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. ఆమె పార్టీ గెలవాలని ప్రార్థిస్తున్నాను. ఆమె ఘనమైన వారసత్వం కొనసాగాలని ఆశిస్తున్నాను” అంటూ శశికళ తన లేఖలో పేర్కొన్నారు.
అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న సమయంలోనూ, విడుదలయ్యే సమయంలోనూ శశికళ రాజకీయ భవితవ్యంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఆమె మళ్లీ అన్నాడీఎంకే పగ్గాలు చేపడతారని, ఎన్నికల్లో పార్టీని తిరుగులేని విధంగా నడిపిస్తారని భావించారు. అయితే, ఎన్నికలు మరికొన్ని వారాల్లో జరగనున్న నేపథ్యంలో చిన్నమ్మ అస్త్రసన్యాసం అన్నాడీఎంకే నేతలకు మింగుడుపడడంలేదు.
చిన్నమ్మ ప్రకటన అన్నా డీఎంకే కు తీరని నష్టం చేస్తుందని రాజకీయ పండితుల భావన .తమిళనాట ఎన్నికల వేళ శశికళ తనను అవమానించిన అన్నా డీఎంకే ఎన్నికల్లో గెలవాలని కోరుకోవటం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

పోడుభూముల సమస్యపై ఎర్ర జెండాల పోరుబాట …

Drukpadam

వద్దిరాజు తిరిగి ఎంపీనేనా …? ఎమ్మెల్యేనా …??

Drukpadam

ఎట్ట‌కేల‌కు అసోం సీఎం హిమంతపై హైద‌రాబాద్‌లో కేసు న‌మోదు…

Drukpadam

Leave a Comment