Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అధికారిక కార్యక్రమంలో మంత్రికి బదులు ఆయన తమ్ముడు…

అధికారిక కార్యక్రమంలో మంత్రికి బదులు ఆయన తమ్ముడు…
-బీహార్ లో విచిత్రం … ముఖ్యమంత్రి సైతం ఆశ్చర్యపోయిన ఘటన
-తాను పేపర్ లో చూసినట్లు సీఎం నితీష్ అసెంబ్లీ లో వెల్లడి
-విచారించి చర్యలు తీసుకుంటానని హామీ
గ్రామ పంచాయతీలలో భార్యకు బదులు భర్త అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నాడని అతని చర్యలు తీసుకోవాలని వస్తున్నా వార్తలను చూస్తున్నాం. కానీ బీహార్ లో మంత్రికి బదులు ఆయన తమ్ముడు అధికారిక కారక్రమాలలో పాల్గొన్న ఘటన చోటుచేసుకున్నది. ముఖ్యమంత్రి సైతం దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైశాలి జిల్లాలో రాష్ట్ర పశుసంవర్ధక ,ఫిషరీస్ శాఖ మంత్రి ముకేశ్ సహానీ ఒక అధికారిక కారక్రమానికి తనకు బదులుగా తన తుమ్ముడిని పంపటం అక్కడ అధికారులు ఆయన్ను మంత్రిలాగానే రిసీవ్ చేసుకొని మంత్రి ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమం లో పాల్గొనటం జరిగాయి. ఈ వార్త పత్రికలలో రావడంతో రాష్టంలో పెద్ద చర్చగా మారింది.శాసనసభలో సైతం ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ తనకు మీడియా ద్వారానే తెలిసిందని ,తనకు సైతం ఆశ్చర్యం కలిగిందని దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related posts

ఇది మీకు తెలుసా ..? రోజుకు ఎన్ని బాదం గింజలు తినాలి..?

Drukpadam

జపాన్​ లో బద్దలైన అగ్ని పర్వతం.. జనాన్ని ఖాళీ చేయిస్తున్న అధికారులు!

Drukpadam

కరోనా నిబంధనల మధ్య భధ్రాద్రి రాముని కళ్యాణం..

Drukpadam

Leave a Comment