Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

డల్లాస్, డెన్వర్‌లలో కాల్పులు.. 8 మంది మృతి

  • గార్లాండ్‌లో ఓ దుకాణంలో కాల్పులు జరిపిన దుండగుడు
  • డెన్వర్‌లోని ఓ వాణిజ్య ప్రదేశంలో మరో ఘటన
  • మృతుల్లో పోలీసు అధికారి, ఇద్దరు మహిళలు

అమెరికాలో తుపాకి మళ్లీ గర్జించింది. డల్లాస్, డెన్వర్‌లలో జరిగిన కాల్పుల ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. డల్లాస్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. నగర శివారులోని గార్లాండ్ లో ఉన్న ఓ దుకాణంలోకి వచ్చిన దుండగుడు పికప్ ట్రక్‌లో బయటకువెళ్లి.. మళ్లీ వెంటనే తిరిగి వచ్చి కాల్పులు జరిపాడు. ఆ వెంటనే అదే ట్రక్‌లో పరారయ్యాడు.

డెన్వర్ సమీపంలో జరిగిన మరో ఘటనలో పోలీసు అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నగర సమీపంలోని ఓ వాణిజ్య ప్రదేశానికి కారులో వచ్చిన నిందితుడు కాల్పులు జరిపాడు. ఈ సందర్భంగా పోలీసులు, నిందితుడికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Related posts

కారులో తరలిస్తున్న రూ. 65 లక్షలు సీజ్

Drukpadam

లంచం తీసుకుంటూ దొరికిపోయిన రైల్వే ఉన్నతాధికారి…

Ram Narayana

భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్.. 5 గంటలకుపైగా నిలిచిపోయిన రైలు!

Drukpadam

Leave a Comment