Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

లీటర్ పెట్రోల్ పై 58 రూపాయల పన్నా…? సీఎల్పీ నేత భట్టి

లీటర్ పెట్రోల్ పై 58 రూపాయల పన్నా…?  సీఎల్పీ నేత భట్టి
-ఇది ప్రజల నెత్తిన భారం కదా ?
-అసలు ధర కేవలం 32 రూపాయలే
-కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు
-అసలు ధర కేవలం 32 రూపాయలే

-పల్లా కు ఓటు ఆత్మహత్య సదృశ్యమే

 

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచి దేశ ప్ర‌జ‌ల‌ను 40 ఏళ్లు వెన‌క్కు తీసుకెళ్లాయ‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు మండిప‌డ్డారు. పెరుగుతున్న పెట్రోల్‌, జీడిల్ ధ‌ర‌ల‌ను నిర‌సిస్తూ భ‌ట్టి విక్ర‌మార్క భ‌ద్రాచ‌లంనుంచి సైకిల్ యాత్ర‌ను ఆదివారం ఆరంభించారు. మొద‌ట‌గా ఆయ‌న‌.. భ‌ద్రాచ‌ల శ్రీ సీతారామ స్వామి వారి ద‌ర్శ‌నం, ప్ర‌త్యేక పూజ‌ల‌ అన‌వ‌త‌రం ఆయ‌న సైకిల్ యాత్రను ఆరంభించారు. అనంత‌రం స్థానిక ఎమ్మెల్యే పొడెం వీర‌య్య క్యాంప్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. పెట్రోల్, డీజిల్ పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్ వైఖ‌రివ‌ల్ల దేశ ప్ర‌జ‌లు 40-50 ఏళ్లు వెన‌క్కి వెళ్లి.. మ‌ళ్లీ సైకిల్ వంటి ప్ర‌యాణ సాధనాలె వాడే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ప్ర‌జ‌ల‌పై మోయ‌లేనంత పెట్రో భారాన్ని ప్ర‌భుత్వాలు వేస్తున్నాయ‌ని అన్నారు. మోదీ, కేసీఆర్ లు పెట్రోల్, డీజిల్ పై ఎడాపెడా ప‌న్నులు వేసి ధ‌ర‌ల పెంచ‌డంతో నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయ‌ని భ‌ట్టి అన్నారు. లీట‌ర్ పెట్రోల్ పై ప్ర‌భుత్వాలు రూ. 58 రూపాయ‌లు ప‌న్నులు వేస్తున్నాయ‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో రూ. 12 మాత్ర‌మే ప‌న్నులు ఉండేవ‌ని చెప్పారు. కాంగ్రెస్ పాల‌నాకాలంలో అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగి.. దాదాపు బ్యారెల్ 138 డాల‌ర్ల‌కు చేరుకున్న స‌మ‌యంలోనూ.. పెట్రోల్ లీట‌ర్ కు 55, లీట‌ర్ డీజిల్ రూ. 44కు ఉండేద‌‌ని చెప్పారు. అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధ‌ర‌లు భారీగా త‌గ్గిన నేప‌థ్యంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు స‌గానికిపైగా తగ్గాలి.. కానీ ప‌న్నుల పేరుతో ఈ ప్రభుత్వాలు సామాన్యుల న‌డ్డి విరుస్తున్నాయ‌ని అన్నారు. మోదీ, కేసీఆర్ నియంతృత్వ పాల‌న సాగిస్తున్నార‌ని భ‌ట్టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఖ‌మ్మం ప‌రిస‌ర ప్రాంతాల్లో నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు, భార‌జ‌లం, సింగ‌రేణి వంటి సంస్థ‌లను ప్ర‌యివేటు ప‌రం చేసి బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు లేకుండా మోదీ ప్ర‌భుత్వం చేస్తోంద‌ని భ‌ట్టి అన్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న శాస‌న‌మండలి ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల్లో ప్ర‌శ్నించే గొంతు అయిన రాములు నాయ‌క్ ను గెలిపించాల‌ని భ‌ట్టి విక్ర‌మార్క విద్యావంతుల‌కు పిలుపునిచ్చారు. నాటి కాంగ్రెస ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేసిన ఉన్న‌త విద్యాసంస్థ‌లు, విశ్వ‌విద్యాల‌యాల్లో చ‌దువుకుని అనేక‌మంది గ్యాడ్యుయేట్లుగా ఎదిగార‌ని అన్నారు. టీఆర్ఎస్ పాల‌న‌లో విద్యను ప్ర‌వేటీక‌ర‌ణ చేసి సామాన్యుల‌కు విద్య‌ను అంద‌ని ద్రాక్ష‌గా మార్చింది. విద్య‌ను కార్పొరేటీక‌ర‌ణ చేయ‌డంలో ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిది కీల‌క పాత్ర అని.. ఆయ‌న‌కు ఓటేస్తే.. విద్య సామాన్య‌ల‌కు అంద‌ద‌ని చెప్పారు. ప‌ల్లాకు ఓటేయడం అంటే ఆత్మ‌హ‌త్యా స‌దృశ‌మ‌ని భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌తో పాటు ఎమ్మెల్యే పొడెం వీర‌య్య‌, ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, మాజీ కేంద్ర‌మంత్రి బ‌ల‌రామ్ నాయ‌క్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వ‌ర‌రావు, ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు పువ్వాళ్ల దుర్గా ప్ర‌సాద్, ఖ‌మ్మం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మ‌హ‌మ్మ‌ద్ జావేద్, ఇత‌ర స్థానిక కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు.

Related posts

జీ20 సదస్సును నిర్వహించడం పెద్ద గొప్పేం కాదు: కేశవరావు

Drukpadam

టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంక‌టేశ్వ‌ర్లు!

Drukpadam

ఆంధ్ర రాజకీయాల్లోకి ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి …గుడివాడిపై గురి …

Drukpadam

Leave a Comment