Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బంగారు బాతుగుడ్డు లాంటి ఆంధ్రభూమిని చంపుతారా? ఐజేయు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి

 

ఆంధ్రభూమి కార్యాలయం ముందు ఐజేయూ, టీయూడబ్ల్యూజే ఆందోళన
-పెద్ద ఎత్తున పాల్గొన్న ఆంధ్రభూమి ఉద్యోగులు
బంగారు బాతుగుడ్డును చంపుతారా … ఐ జే యూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి
-ఆంధ్రభూమి అక్షరాన్ని కొరోనా పేరుతో నలిపేయొద్దు … నగునూరి శేఖర్
-మీకు చేతకాక పొతే చెప్పండి మేమె పత్రికను నడుపుతాం … విరహత్ అలీ

తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ సోమవారం నాడు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ),  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)మద్దతుతో ఆంధ్రభూమి ఉద్యోగుల అసోసియేషన్ నిర్వహించిన ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉద్యోగుల నినాదాలతో సరోజిని దేవి రోడ్డు దద్దరిల్లిపోయింది. దక్కన్ క్రానికల్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా ఆ పత్రిక యాజమాన్యాన్ని హడలెత్తించింది. ఆందోళనను భగ్నం చేసేందుకు పోలీసు బలగాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రదర్శనకు ముందు క్లాక్ టవర్ వద్ద అమరుల స్థూపానికి నివాళ్ళర్పించారు. ఆంధ్రభూమి ఉద్యోగుల సమస్య రెండు తెలుగు రాష్ట్రాలకు ముడిపడి ఉన్నందున ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే), తెలంగాణా స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్.యు.జె) సంఘాలు మద్దతు తెలిపాయి. ఐజేయూ నాయకులు కె.శ్రీనివాస్ రెడ్డి, అమర్ నాథ్, అంబటి ఆంజనేయులు, ఆలపాటి సురేష్, సోమసుందర్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, నాయకులు ఏ.రాజేష్, కె.రాములు, హెచ్.యు.జె కార్యదర్శి శిగ శంకర్ గౌడ్, టి.ఎస్.పి.జె.ఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, హరి, ఆంధ్రభూమి ఎంప్లాయిస్ అసోసియేషన్ కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్, నాయకులు వి.విజయ్ ప్రసాద్, జె.ఎస్.ఎం.మూర్తి, స్వామినాథ్, నగేష్, వసుంధర, ఆదిలక్ష్మీ, రిటైర్డ్ ఎంప్లాయిస్ నాయకులు బాలకృష్ణ, నర్సింగ్ రావు శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన ఆదోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐ జే యూ అధ్యక్షులు కే .శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అన్యాయం ,అక్రమాలు , అవినీతి , దుర్వినియోగం మీరుచేసి ఉద్యోగులను బలిపశువులను చేస్తారా అని మీకు న్యాయమనిపిస్తే చేయండన్నారు . బంగారు బాతు గుడ్డు లాంటీ ఆంధ్రభూమి పీకనులిమి చంపుతారా ? అని ప్రశ్నించారు.అవసరమైతే ఉద్యోగులకు కలకత్తా లో ఉన్న యాజమాన్యం దగ్గరకు వెళతామని తెలిపారు . ఇప్పటికైనా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రభూమి పత్రికను తెరిపించి దీని పై ఆధారపడ్డ ఉద్యోగులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. మీకు చేత కాకపోతే తప్పుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రావాల్సిన అన్నిరకాల బెనిఫిట్స్ ను తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.
టి యూ డబ్ల్యూ జే అధ్యక్షులు నగునూరి శేఖర్ మాట్లాడుతూ ఆంధ్రభూమి ఉద్యోగుల తరుపున తమ సంఘం ఎంతకైనా పోరాడుతుందని అన్నారు. గొప్ప చరిత్ర ఉన్న ఆంధ్రభూమి అక్షరాన్ని కరోనా పేరుతొ నలిపేయొద్దన్నారు.వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిస్కరించాలని డిమాండ్ చేశారు.
టి యూ డబ్ల్యూ జే ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ మాట్లాడుతూ పత్రికను తెరిపించమంటే యాజమాన్య కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. నష్టాల్లో ఉందని సాకులు చెపుతుందని దానికి ఎవరు కారకులని ప్రశ్నించారు. మీకు చేతకాక చెప్పండి పొతే మేమె నడుపుతాం అన్నారు .ఒక పక్క నష్టాల్లో ఉందని సర్కులేషన్ 13 వేలు మాత్రమేనంటూ కోర్ట్ కు చెబుతూ మరో పక్క ఆంధ్ర భూమి సర్కులేషన్ లక్ష 70 ఉందని న్యూస్ ప్రింట్ దగ్గర చెబుతూ తక్కధరకు న్యూస్ ప్రింట్ పొందుతూ డెక్కన్ క్రానికల్ కు ఉపయోగిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.


న్యాయం చేస్తాం-యాజమాన్యం

——————-//———////—-
ఆంధ్రభూమి ఉద్యోగుల పోరాటంపై యాజమాన్యం దిగివచ్చింది. యాజమాన్య ప్రతినిధి, డిప్యూటీ సిఇఓ పి.ఎస్.వి.కృష్ణయ్య యూనియన్ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు చట్టపరంగా దక్కాల్సిన అన్నీ ప్రయోజనాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ వ్యవహారం ఎన్.సి.ఎల్.టిలో ఉన్నందున తుది తీర్పు వచ్చాక తమ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన భరోసానిచ్చారు.

Related posts

సానియా మీర్జా-షోయబ్ మాలిక్ బంధానికి బీటలు!

Drukpadam

తల్లి తండ్రి వేరు వేరు దేశాలు అందుకే రాహుల్ ఆలోచనల్లో తేడా…హర్యానా మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు !

Drukpadam

బెంగాల్ , అస్సోమ్ లలో భారీ పోలింగ్ ఎవరికీ లాభం

Drukpadam

Leave a Comment