Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నా ప్రజాసామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరు… గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తా: జేపీ నడ్డా!

నా ప్రజాసామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరు… గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తా: జేపీ నడ్డా!
-ర్యాలీకి పిలుపునిచ్చిన తెలంగాణ బీజేపీ
-అనుమతి లేదంటున్న పోలీసులు
-జేపీ నడ్డాను శంషాబాద్ ఎయిర్ పోర్టులో కలిసిన జాయింట్ సీపీ
-నడ్డాకు నోటీసులు …బీజేపీ మండిపాటు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి హైద్రాబాద్ చేరుకున్నారు. నడ్డాను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనే హైద్రాబాద్ పోలీసులు కలిసి కరోనా నిబంధనల దృష్ట్యా ఇలాంటి ర్యాలీలకు అనుమంతి లేదని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా జాయింట్ పోలీస్ కమిషనర్ కార్తికేయ నడ్డా వద్ద కు వెళ్లి నచ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. అయితే పోలిసుల విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించిన నడ్డా కరోనా నిబంధనలు పాటిస్తూ ర్యాలీ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా బయలు దేరారు . అయితే పోలీసులు కొన్ని షరతులు విధించారు. చివరకు నడ్డా కు పోలీసులు నోటీసులు అందించారు. దీనిపై బీజేపీ మండి పడింది . ఆయినా ఆయన శాంతి యుతంగా ర్యాలీ జరిపేందుకు నిర్ణయించుకున్నారు . దీంతో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు నడ్డా కు అనుకూలంగా నినాదాలు చేశారు. తాను భాద్యత గల పౌరుడిగా నిరసన తెలుపుతానని అన్నారు . తనకు కరోనా నియమ నిబంధనలు తెలుసునని పేర్కొన్నారు .

రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ, బీజేపీ శ్రేణులు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ తలపెట్టాయి. ఈ ర్యాలీలో పాల్గొనాలని నడ్డా భావించారు. అయితే ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే, పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.

దీనిపై నడ్డా స్పందించారు. తనను జాయింట్ సీపీ కార్తికేయ కలిశారని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పారని వివరించారు. అయితే తాము కరోనా నిబంధనలు పాటిస్తామని స్పష్టం చేశారు. తన ప్రజాస్వామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరని, కరోనా మార్గదర్శకాలు పాటిస్తూనే గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో, కాసేపట్లో నడ్డా సికింద్రాబాద్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts

కేసీఆర్, జగన్ చేతులు కలిపి నదీ జలాల అంశాన్ని వివాదం చేస్తున్నారు: బండి సంజయ్…

Drukpadam

ఆంధ్రాలో ఏముంది…కులరాజకీయాలు తప్ప!: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి…

Drukpadam

ఓవైసిలోనూ సామజిక కోణం …రాజకీయాల్లో సంపన్న కులాలే ఉండటంపై ఆక్షేపణ …

Drukpadam

Leave a Comment