Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బీజేపీ ,టీఆర్ యస్ లకు బుద్ది చెప్పండి…సిఎల్పీ నేత భట్టి విక్రమార్క

సైకిల్ సందర్బంగా మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి

-ధరలు ఇలా పెరిగితే బతికేది ఎట్టా?
-కూలీ పైసలు కూరగాయలు కొనేందుకు సరిపోవడం లేదు
– పప్పులు,నూనెలు కొనలేని పరిస్థితి
-సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్న మోదీ, కేసీఆర్

సిఎల్పీనేతభట్టివిక్రమార్క

🔹
పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చేస్తున్న సైకిల్ యాత్ర రెండోరోజు కొనసాగుతోంది. భట్టి విక్రమార్క చేస్తున్న సైకిల్ యాత్రకు మధ్యతరగతి ప్రజలు, మహిళలు, చిరు వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. పాల్వంచ నుంచి మొదలైన భట్టి రెండోరోజు సైకిల్ యాత్ర లక్ష్మీదేవిపల్లి వద్దకు చేరుకునిసరికి.. ఒక్కసారిగా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి భట్టికి తమ బాధలు వెళ్లబోసుకున్నారు. పెరిగిన ధరలతో పడుతున్న ఇబ్బందులు, కష్టాలను మహిళలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్యాస్ బండ కొనలంటేనే భయం వేస్తోందని భట్టికి ఒక గృహిణి చెప్పింది. ఇప్పటికే రూ.1000 అయిందని.. రూ.1500 అయ్యేలా ఉందని ఆమె భట్టికి చెప్పారు. కూలీ.. నాలీ చేసి సంపాదించిన డబ్బులు ఇలా గ్యాస్ కె పోతే ఎలా బతకాలి అని ఆమె భట్టి ముందు ఆవేదనగా చెప్పారు. ఇదిలా ఉండగా.. కూలీ చేసి సంపాదించిన రూ.200 కూరగాయలు కొనేందుకు కూడా సరిపోవడం లేదని.. ఇలా ధరలు పెరిగితే ఏమి తిని బతకాలని ఆమె భట్టికి చెప్పారు. మరో మధ్యతరగతి గృహిణి మాట్లాడుతూ.. కందిపప్పు కిలో రూ.150 అయింది.. వంట నూనె లీటర్ పాకెట్ రూ.150 అయింది.. రేట్లు ఇలా పెంచుకుంటూ పోతే.. ఎలా జీవించాలి.. పిల్లలకు ఏమి పెట్టాలి అని భట్టికి తమ బాధను చెప్పింది. మేము కూలి పనులు చేసుకొని బతికేవాల్లం ధరలు ఇట్లా పెరుగుతా ఉంటే మా బతుకులు గడిచేదెట్లా.. అని మరో మహిళ ఆవేదనగా భట్టికి చెప్పింది. కూరగాయలు కొనలేక పచ్చడి మెతుకులు మేము తింటున్నాం.. అదే మా పిల్లలకు పెడుతున్నాం.. అని కొందరు మహిళలు చెప్పారు.
మధ్యతరగతి, సాధారణ కూలీ మహిళలు చెప్పిన బాధలు విని.. దానిపై భట్టి విక్రమార్క స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి రేట్లు పెంచుకుంటూ సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని ఆగ్రహంగా అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదలతో రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా బాగా మండిపోతున్నాయని అన్నారు. మహిళలు, యువత అందరూ కలిసి బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని భట్టి విక్రమార్క పిలునిచ్చారు.

Related posts

ప్రపంచంలోనే శక్తిమంతమైన బాంబును ఉక్రెయిన్ కు తరలించిన రష్యా!

Drukpadam

అంబులెన్సులు లేకుంటే గుర్రాలను వాడండి: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

Drukpadam

డోలి కళాకారుడు ఆదివాసీ ఆణిముత్యం ప్రదశ్రీ గ్రహీత సకిని రామచంద్రయ్య కు ఘనసన్మానం!

Drukpadam

Leave a Comment