Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముగ్గురు టీటీడీ సభ్యులకు నోటీసులివ్వండి: ఏపీ హైకోర్టు

ఈనాడు, సాక్షి పత్రికల్లో ప్రకటనల ద్వారా ఆ ముగ్గురు టీటీడీ సభ్యులకు నోటీసులివ్వండి: ఏపీ హైకోర్టు

  • బోర్డులో 18 మంది నేరచరితులు ఉన్నారంటూ పిల్
  • వారికి పంపిన నోటీసుల్లో తిరిగొచ్చిన మూడు నోటీసులు
  • పత్రికల్లో ప్రకటనల ద్వారా వారికి నోటీసులు ఇవ్వాలన్న కోర్టు
  • ఫిబ్రవరి 7వ తేదీకి విచారణ వాయిదా
నేర చరిత్ర, రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న 18 మందిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యులుగా నియమించారని ఆరోపిస్తూ బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి జి.భానుప్రకాశ్ రెడ్డి గతంలో ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు 18 మంది సభ్యులకు నోటీసులు ఇచ్చింది. అయితే, వీరిలో ముగ్గురు.. అల్లూరి మల్లేశ్వరి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎంఎస్ శశిధర్‌కు పంపిన నోటీసులు తిరిగి వచ్చాయంటూ నిన్న జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీనికి స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం.. నోటీసులు అందుకోని ముగ్గురికి ఈనాడు, సాక్షి పత్రికల్లో ప్రకటనల ద్వారా నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

Related posts

మహారాష్ట్ర మాజీ హోంమంత్రిపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీం ఓకే

Drukpadam

ఇక వృద్ధాప్యం రానే రాదు.. చావులేని ఈ జెల్లీ ఫిష్‌ మనకు దారి చూపుతుందంటున్న పరిశోధకులు!

Drukpadam

ల్యాబ్ లో తయారు చేసిన మాంసంపై నిషేధం విధించిన ఇటలీ.. ప్రపంచంలోనే తొలి దేశం!

Drukpadam

Leave a Comment