Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో నయరాజాకార్ పాల‌న: భట్టి , మధు యాష్కీ కేసీఆర్!

తెలంగాణ రాష్ట్రంలో గ‌తంలో ర‌జాకార్ల పాల‌న: భట్టి , మధు యాష్కీ గౌడ్
నయరాజాకార్ గా కేసీఆర్
వనమా రాఘవ వలన కుటంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు
ఇది ఆత్మహత్యకాదు ముమ్మటికి హత్యే
ఇది అధికార మదంతో జరిగిన ఘటన రాఘవపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి

తెలంగాణ రాష్ట్రంలో గ‌తంలో ర‌జాకార్ల పాల‌న గురించి విన్నాం.. రజ‌కార్ల అరాచ‌క‌త్వం గురించి చ‌దివినం.. ర‌జాకార్లు మ‌హిళ‌ల‌ను చెర‌చి భ‌ర్త‌ల‌ను చంపిన ఉదంతాలు విన్నాం.. ఇప్పుడు చూస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ లు అన్నారు . ఈరోజు హైద్రాబాద్ లోని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొన్నారు.

కానీ సాధించకున్న తెలంగాణ రాష్ట్రంలో క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు నియో న‌యో ర‌జాకార్ గా మారాడు. కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరాచ‌క‌త్వాలు, క‌బ్జాలు, దోపిడీలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు .

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కొడుకు వనమా రాఘవ వల్ల కొత్తగూడెం పాల్వంచలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆత్మ‌హ‌త్య కాదు. హ‌త్య‌నే. దీనికి ఎమ్మెల్యే కొడుకు రాఘ‌వ‌నే కార‌ణ‌మ‌ని సూసైడ్ నోట్ లో కూడా స్ప‌ష్టంగా ఉందిని వారు పేర్కొన్నారు . ఇంతటి దారుణానికి కారణమైన వనమా రాఘను చట్ట ప్రకారం హత్యే కేసు పెట్టి శిక్షించాలి

రాఘవను దాచేందుకు ప్రభుత్వం పెద్దలు చేయని ప్రయత్నంలేదని విమర్శించారు . కేంద్రంలో నరేంద్రమోదీ మంత్రివర్గంలోని మంత్రి కుమారుడు రైతులను కారుతో తొక్కి చంపుతాడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొడుకేమో ఒక వ్యాపారి, ఒక గిరిజన మహిళ, నిన్న ఒక కుటుంబం చనిపోవడానికి కారణంగా మారాడు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్బలం వల్లే వనమారాఘను పోలీసులు సంఘటన జరిగి నాలుగు రోజులు అయిన అరెస్ట్ చేయడం లేదని చివరకు ప్రజల వత్తిడి మేరకు అరెస్టు చేసిన విషయాన్నీ వారు గుర్తు చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మానవత్వం ఉంటే రాఘవకు న్యాయపరంగా, చట్టపరంగా ఉరిశిక్ష పడేలా చేయాలనీ డిమాండ్ చేశారు .

ఈఘటనకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పూర్తి బాధ్యత వహించాలి. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావును వెంటనే భర్తరఫ్ చేయాలి. వనమా రాఘవను ముందే అరెస్ట్ చేసివుంటే ఒక అమాయక కుటుంబం ప్రాణాలతో ఉండేదని వారు పేర్కొన్నారు .

ఈ ఘటనపై డీజీపీ సహా అందరినీ కలుస్తాం..

ఈ ప్రెస్ మీట్ లో మధు యాష్కీ గౌడ్ తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, ఎన్.ఎస్,యూ.ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకెట అన్వేష్ రెడ్డి, కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రేపు ప్రధానితో కశ్మీర్‌ నేతల భేటీ: లోయలో భద్రత కట్టుదిట్టం…

Drukpadam

ప్రజలకు కావాల్సింది మొసలి కన్నీరు కాదు.. టీకాలు: మోదీపై కాంగ్రెస్ ఫైర్!

Drukpadam

బీజేపీపై ముకుల్ కుమారుడి ఫైర్,,,

Drukpadam

Leave a Comment