Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సంక్రాంతికి హైద్రాబాద్ ఖాళీ …సొంతూళ్లకు క్యూకట్టిన జనం!

సంక్రాంతికి హైద్రాబాద్ ఖాళీ …సొంతూళ్లకు క్యూకట్టిన జనం!
హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై భారీగా ట్రాఫిక్ జామ్
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్ల‌కు ప్ర‌జ‌లు
ఎన్‌హెచ్‌ 65పై వాహనాలు బారులు
ఉష్ణోగ్రతలు పడిపోవడంతో దట్టంగా పొగమంచు

తెలుగు ప్రజలకు అత్యంత పెద్ద పండగగా ,ప్రత్యేకించి కోస్తా ప్రజలకు కోడిపందాల పండుగగా ఉన్న సంక్రాంతికి హైద్రాబాద్ ఖాళీ అవుతుంది. అనేకమంది ఈ పండగకోసమే సొంతూళ్లకు క్యూకట్టారు . ఫలితంగా ఏ రహదారి చుసిన వాహనాలతో నిండిపోయి ఉంది. హైద్రాబాద్ నుంచి విజయవాడ వరకు వాహనాలు కదలటమే కష్టంగా మారింది. దీనికి తోడు టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి ఈ ఉదయం పొగమంచు తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు . అనేక ప్రయేక రైళ్లు ,వేలాదిగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బస్సు సర్వీసులు వేసినప్పటికీ రైల్వే స్టేషన్ లు , బస్సు స్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. సొంతవాహనాలు ఉన్నవారు వారి వాహనాలతో సొంతూర్లకు పరుగులు తీస్తున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా హైద‌రాబాద్ నుంచి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున సొంత ఊళ్ల‌కు త‌ర‌లివెళ్తుండ‌డంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఎన్‌హెచ్‌ 65పై వాహనాలు బారులు తీరి క‌న‌ప‌డుతున్నాయి. దానికి తోడు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జాతీయ రహదారిపై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు క‌దులుతున్నాయి.

సాధారణంగా ఉండే ర‌ద్దీ కంటే వాహనాల రాకపోకలు భారీగా పెరగడంతో టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ట్యాక్స్‌ చెల్లింపు కేంద్రాలను పెంచారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు న‌డుపుతోంది. మొత్తం 4,360 బస్సులను ఏర్పాటు చేసి, వాటిలో 590 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. మ‌రోవైపు, ఏపీ కూడా ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతోంది.

Related posts

వినీలాకాశంలో… రుధిర చంద్రుడు….

Drukpadam

బెల్లం వేణు నీ చరిత్ర ఏమిటి..? : సిపిఐ నేత మౌలానా !

Drukpadam

‘అగ్నిపథ్’ ఆగదు..లెఫ్టినెంట్ జనరల్ అనిల్‌పురి…

Drukpadam

Leave a Comment