Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు నడుం బిగించిన కేసీఆర్!

  • ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు నడుం బిగించిన కేసీఆర్!
    -మొన్న స్టాలిన్ ,నిన్న లెఫ్ట్ నేతలతో , నేడు ఆర్జేడీ నేత తేజశ్వని యాదవ్ తో
    -కేసీఆర్ తో భేటీ అయిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్
    -స్వాగతం పలికిన కేటీఆర్
    -ప్రగతి భవన్ కు వెళ్లిన తేజస్వి యాదవ్
    -జాతీయ రాజకీయాలపై చర్చ
    -ప్రాంతీయ పార్టీలు పోషించాల్సిన పాత్రపై సమాలోచనలు
  • ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదని గ్రహించిన కేసీఆర్ బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించారు. అందులో భాగంగానే ఆయన దేశంలోని బీజేపీయేతర పార్టీల నేతలతో వరస భేటీలు జరుపుతున్నారు. ఢిల్లీ వెళ్లి ఎప్పడు లేనిది తొమ్మిది రోజులు మకాం వేశారు . ఢిల్లీలో టీఆర్ యస్ కేంద్ర కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అనేక మంది నేతలతో టచ్ లో ఉన్న కేసీఆర్ తమిళనాడు వెళ్లి చెన్నై లో స్టాలిన్ ను కలిశారు. అంతకు ముందు ఎస్పీ నేత అఖిలేష్ ను రాష్ట్రానికి ఆహ్వానించారు. నిన్నగాక మొన్న జానెడు బెత్తెడు లేరు అన్న లెఫ్ట్ నేతలను కలిసి జాతీయరాజకీయాలు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ పై చర్చలు జరిపారు. నీరు బీహార్ కు చెందిన ఆర్జేడీ నేత లల్లూ ప్రసాద్ తనయుడు తేజశ్వని యాదవ్ తో నేడు హైద్రాబాద్ ప్రగతి భవన్ లో సమావేశం జరిపారు . మొత్తం మీద నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు సందర్భంగా ఎన్టీఆర్ పాత్ర పోషించాలని ప్రయత్నం చేస్తున్నారు.గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకసారి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఆలోచనలు చేసిన కేసీఆర్ వెనక్కు తగ్గారు.కర్ణాటక ఎన్నికల్లో దేవెగౌడ జేడీస్ సమర్థించారు . మమతా బెనర్జీని కొలకత్తా వెళ్లి కలిశారు . స్టాలిన్ తో మంతనాలు జరిపారు . తరువాత థర్డ్ ఫ్రంట్ లాంటి ఫీలర్లు వదిలారు . దాన్ని మళ్ళీవెనక్కు తీసుకున్నారు. థర్డ్ ఫ్రంట్ లేదు గిరుడు ఫ్రంట్ లేదని అన్నారు. ఇప్పడు ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ తో తీవ్ర విభేదాలు పొడచూపాయి. దీనితో బీజేపీ వ్యతిరేక కూటమి పై ద్రుష్టి సారించిన కేసీఆర్ అందుకు అనుగుణంగా పావులు కదుపు తున్నారు. అందులో భాగంగానే నేడు తేజశ్వని యాదవ్ తో భేటీ జరిపారు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత తేజస్వి యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ కు తేజస్వి నేతృత్వంలోని ఆర్జేడీ బృందం వెళ్లింది. ఈ బృందంలో ఆర్జేడీ నేతలు సునీల్ సింగ్, బారీ సిద్ధిఖీ, భోలా యాదవ్ ఉన్నారు. ప్రగతి భవన్ కు చేరుకున్న తేజస్వికి మంత్రి కేటీఆర్ ఆత్మీయ స్వాగతం పలికి, లోపలకు తీసుకెళ్లారు.

ప్రగతి భవన్ కు వచ్చిన తేజస్వికి కేసీఆర్ పుప్పగుచ్ఛం అందించారు. జాతీయ రాజకీయాలపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలు పోషించాల్సిన పాత్రపై చర్చలు జరుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ కు తేజస్వి యాదవ్ గట్టి పోటీ ఇచ్చారు. కొంచెం అటూఇటూ అయి ఉంటే తేజస్వి సీఎం అయిపోయేవారు. మరోవైపు థర్డ్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే.

Related posts

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం కొందరికి మోదం …కొందరికే ఖేదం…

Drukpadam

కాంగ్రెస్‌కు 70 సీట్లు రాకుంటే రాజీనామా.. ఎంపీ కోమటిరెడ్డి ప్రకటన…

Drukpadam

నేను స్వయంగా వచ్చి ఓట్లు అడగాలని భావించా.. కానీ, కరోనా నిబంధనల కారణంగా రాలేకపోతున్నా: బద్వేలు ఓటర్లకు జగన్ లేఖ!

Drukpadam

Leave a Comment