Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుమల నుంచి అలిగి వెళ్లిపోయిన వైసీపీ ఎంపీ రెడ్డెప్ప!

తిరుమల నుంచి అలిగి వెళ్లిపోయిన వైసీపీ ఎంపీ రెడ్డెప్ప!
-తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప
-తనకు కేటాయించిన అతిథిగృహంలో వసతులు బాగోలేవని మండిపాటు
-మరో గది కేటాయిస్తామని చెప్పినా అలిగి వెళ్లిపోయిన ఎంపీ

చిత్తూరు కు చెందిన వైసీపీ ఎంపీ రెడ్డప్ప ముక్కోటి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు….కానీ ఆయనకు వసతులు సరిగా కేటాయించలేదని సిబ్బందిపై ఫైర్ అయ్యారు. ఆయన వకుళామాత అతిధి గృహంలో గది కేటాయించారు. వివిఐపీలకు కేటయించేందుకు చాల గదులు ఉన్నప్పటికీ పార్లమెంట్ సభ్యుడు స్వయంగా వస్తే ఆయనకు వకుళామాత అతిథిగృహం కేటాయించడంపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. ఎంపీ ఎవరికో సిఫార్స్ లేఖ రాస్తే వకుళామాత కేటాయించడం జరుగుతుంది. వకుళామాత కొత్తగా నిర్మించిన గెస్ట్ హౌస్ అయినప్పటికీ ఎంపీలు , ఎమ్మెల్యేలకు అన్నమయ్య లేదా పద్మావతి , సుబ్బిరామిరెడ్డి , లాంటి గెస్ట్ హౌస్ లు అనేకం ఉన్నాయి. స్థానిక జిల్లా ఎంపీ అయినా రెడ్డెప్పకు వకుళమాతలో కేటాయించడం అందులో కూడా దుప్పట్లు బెడ్ షీట్స్ సరిగా లేకపోవడం పై ఎంపీ ఆగ్రహం చెందారు . సౌకర్యాల కల్పనపై అక్కడ ఉన్న సిబ్బందిని నిలదీశారు. చివరకు వారినుంచి సరైన సమాధానం లేకపోవడంతో అలకబూని వెళ్లి పోయారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులతో కిక్కిరిసి పోయింది. వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి వచ్చారు. వీవీఐపీలు, వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మరోవైపు వైసీపీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప అలిగి వెళ్లిపోయారు.

వివరాల్లోకి వెళ్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వకుళమాత, నందకం అతిథిగృహాలను కేటాయించారు. దీంతో వకుళమాత అతిథిగృహానికి చేరుకున్న రెడ్డెప్ప… తనకు కేటాయించిన గదిలో సరైన సౌకర్యాలు లేవని అక్కడి రిసెప్షన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెడ్స్, బెడ్ షీట్లు సరిగా లేవని మండిపడ్డారు. వేరే గదిని కేటాయిస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఆయన శాంతించలేదు. అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు పలువురు ఇతర ఎమ్మెల్యేలు కూడా గదుల కేటాయింపుపై అసహనం వ్యక్తం చేశారు.

Related posts

ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి కొన్ని దళాలను ఉపసంహరించుకున్న రష్యా!

Drukpadam

వైజాగ్ నుంచి గోవా.. ఇక 2 గంటలలోపే ప్రయాణమే!

Drukpadam

ఒకసారి ఆ పని చేస్తే జనం ఎగబడతారు.. ఆధార్ సంఖ్యను మార్చలేం: స్పష్టం చేసిన ‘ఉడాయ్’!

Drukpadam

Leave a Comment