Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది: బీవీ రాఘవులు!

బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది: బీవీ రాఘవులు!
-ఇటీవల కేసీఆర్ తో వామపక్ష నేతల సమావేశం
-కేంద్రంపై వామపక్షాలు పోరాడతాయన్న రాఘవులు
-హక్కుల కోసం రాష్ట్రాలు కలిసిరావాలని సూచన
-బీజేపీతో తెలంగాణకు ముప్పుందన్న తమ్మినేని వీరభద్రం

ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో హైదరాబాదులో వామపక్ష నేతలు సమావేశం కావడం తెలిసిందే. దేశరాజకీయాల్లో ఇది కీలకమైన పరిణామంగా రాజకీయపండితులు భావిస్తున్నారు . కేసీఆర్ కు సైతం ఇప్పుడు వామపక్షాల లాంటి పార్టీలు అండలేకపోతే ప్రజల్లో తరుగుతున్న పట్టును తిరిగి పొందటం కష్టంగా భావిస్తున్నారు. అందువల్లనే జానెడు బెత్తెడు పార్టీలు అన్న వామపక్షాలను ప్రగతి భవన్ కు ఆహ్వానించి వారితో దేశ రాజకీయాలపై చర్చించడం గమనార్హం . ఈ క్రమంలో సీపీఎం అగ్రనేత బీవీ రాఘవులు స్పందించారు. హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కలిసి పోరాడుదామని కేసీఆర్ ను కేరళ సీఎం పినరయి విజయన్ కోరారని రాఘవులు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం పోరాటాలకు సిద్ధమవుతోందని రాఘవులు వెల్లడించారు.

బీజేపీతో తెలంగాణకు ముప్పు …సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, కేసీఆర్ మెతక వైఖరి వల్లే తెలంగాణలో బీజేపీ బలపడుతోందని అన్నారు. బీజేపీపై కేసీఆర్ బహిరంగ పోరాటం చేయాలని పేర్కొన్నారు. విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తున్న బీజేపీతో తెలంగాణకు ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు.

Related posts

టీడీపీ కార్య‌క‌ర్త‌లు బ‌రి తెగించారు… కుప్పం ఘ‌ర్ష‌ణ‌ల‌పై స‌జ్జ‌ల ఆగ్ర‌హం

Drukpadam

ఏపీ స్థానిక పోరులో బెదిరంపుల పర్వం …

Drukpadam

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రష్యా టూర్ పై దుమారం!

Drukpadam

Leave a Comment