Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెరుకుకే పట్టం కట్టాలి-జాజుల

ఖమ్మంలో మోటర్ సైకిల్ ర్యాలీలో జాజుల

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులoతా చెరుకు కే పట్టం కట్టాలి.


బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

ఖమ్మం మార్చి 12. ఈనెల 14వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగులో వరంగల్ ,నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని , 5 లక్షల 20 వేల మంది పట్టభద్రులు విజ్ఞతతో, ఆలోచించి, తెలంగాణ ఉద్యమకారుడు, పట్టభద్రుల ప్రశ్నించే గళం అయినటువంటి డాక్టర్ చెరుకు సుధాకర్ కు మొదటి ప్రాధాన్యత ఓటుతో ,ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం నగరంలో డాక్టర్ చెరుకు సుధాకర్ విజయాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ఇంటి పార్టీ, బీసీ సంక్షేమ సంఘం ,
బహుజన జే.ఏ.సి, ఎల్. హెచ్. పీ. ఎస్ , ఎమ్మార్పీఎస్ , ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు, తెలంగాణ ఉద్యమకారులు ,సామాజిక శక్తులు, ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తొలుత పూలే దంపతుల, తెలంగాణ అమరవీరుల విగ్రహా లకు నివాళులర్పించారు . ఖమ్మం ,వరంగల్ ,నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ కుమార్తె నవ్య , పెవిలియన్ గ్రౌండ్ నుంచి బైక్ ర్యాలీ ను జెండా ఊపి, ప్రారంభించారు.బహుజన జేఏసి చైర్మన్ డాక్టర్ కె. వి. కృష్ణారావు ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ పూ రీ వెంకటేశ్వరావు, బిసి సంక్షేమ సంఘం నాయకులు మధు , బీసీ సంక్షేమ సంఘం ఉపధ్యక్షుడు సుంకర శ్రీనివాస రావు తో కలిసి ,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగాతెలంగాణ ఇంటి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బత్తుల సోమయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు అణగారిన వర్గాల, ఆధిపత్య వర్గాల మధ్య జరుగుతున్న ఎన్నికలనీ అభివర్ణించారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో రేపటి రాజకీయ చిత్రపటాన్ని మార్చడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా , ఈ ఎన్నికల్లో డాక్టర్ చెరుకు సుధాకర్ గెలుస్తాడ నే భయంతో సీఎం. కే.సీ.ఆర్ . రాత్రికిరాత్రే ఉద్యోగ ,ఉాధ్యాయ సంఘాలను ప్రగతి భవన్ కు పిలిపించి ,29 శాతం పిఆర్సి ప్రకటన చేశారని విమర్శించారు. ఈ పి .ఆర్. సి .అంశ ము లో కేసీఆర్ ఇచ్చిన హామీని, నాలుగు లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ, సింగరేణి ఉద్యోగులు, సబ్బండ వర్గాలు నమ్మడం లేదని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా వరదబాధితులకు ఎన్నికల అనంతరం పదివేల రూపాయలను ఇస్తానని, సీఎం స్వయంగా ప్రకటించినా దిక్కులేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. నాలుగు గోడల మధ్య ఉద్యోగుల చే వి లో 29 శాతం పిఆర్సి ఇస్తామని ప్రకతించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాల నాయకులు మరోసారి మోసపోవడం సిద్ధంగా లేరని అన్నారు.తెలంగాణ వస్తే వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ను ప్రకటిస్తామని హామీ ఇచ్చిన, సీఎం గత 7 సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారని ఎద్దేవా చేశారు .పన్నెండు వందల మంది ఆత్మబలిదానాలు చేస్తే దానికి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు . రాష్ట్రంలోని 40 లక్షల మందికి నిరుద్యోగ భృతి రావాలన్నా, ఖాళీగా ఉన్న రెండు లక్షల పోస్టులు భర్తీ కావాలన్నా, 40 వేల టీచర్ల పోస్టులను భర్తీ కావాలన్నా, 40 శాతం పిఆర్సి ప్రకటించబడ్డాలన్న , ఆర్టీసీ ,సింగరేణి ఉద్యోగులకు, ఉద్యోగ భద్రత కల్పించాలన్న, నిఖార్సయిన తెలంగాణ వాది , చెరుకు సుధాకర్ను గెలిపించాల్సిన చారిత్రక అవసరం ఎంతో ఉందని అన్నారు .అందుకు అందరూ రూ అండగా నిలిచి అఖండ మెజారిటీతో, డాక్టర్ చెరుకు సుధాకర్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
డాక్టర్ చెరుకు సుధాకర్ గెలుపూ ఆ య నది , కాదని అది ప్రతి ఒక్కరి గెలుపు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీవిధ సంఘాల నాయకులు బానోత్ బద్రు నాయక్, పెరుగు వెంకట రమణ, చేకూరి చైతన్య, కనుక బండి రవీందర్, పులిపాటి ప్రసాద్ సోమరాజు, గోపాల్ , మారోజు వీరన్న, బాబు, వెంకన్న, తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు కల్వకుంట్లలత, వరలక్ష్మి, ఉజ్వల, వడ్డెబోయిన వెంకటేశ్వర్లు ,రాజేష్ , వంగూరి ఆనందరావు, రవీందర్ నాయక్ , బచ్చలికూర వెంకటేశ్వర్లు, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీఆర్ఎస్ ఆఫీసు ముందు ఆగి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు… ఆందుకే మా వాళ్లు ఆవేశపడ్డారు: వినోద్

Drukpadam

స్టార్ హోటళ్లలో కూర్చుని రైతులపై అభాండాలు వేస్తారా?: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఫైర్!

Drukpadam

రాజమౌళి, సుకుమార్‌, త్రివిక్రమ్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Drukpadam

Leave a Comment