Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కారుపై కూలిన విమానం.. ఇద్దరు సజీవ దహనం

  • అమెరికాలో ఫ్లోరిడాలో ఘటన
  • భారీ ఎత్తున చెలరేగిన మంటలు
  • మృతిచెందిన వారివురూ మహిళలే
  • సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు
Aeroplane fell on a car in florida

సాధారణంగా రోడ్డు ప్రమాదం అంటే రెండు కార్ల మధ్యనో లేదా ఏవైనా రెండు వాహనాల మధ్యనో జరిగిందని అనుకుంటాం. కానీ, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కారుపై ఏకంగా విమానం కూలింది. దీంతో ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

వివరాల్లోకి వెళితే… దక్షిణ ఫ్లోరిడాలోని నార్త్‌ పెర్రీ విమానాశ్రయం నుంచి ఓకే ఇంజిన్‌ ఉండే ఓ చిన్న విమానం టేకాఫ్‌ అయ్యింది.  అయితే, సాంకేతికత సమస్య తలెత్తడంతో ఒక్కసారిగా రోడ్డుపై వెళ్తున్న కారుపై కుప్పకూలింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దహనమయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ అనూహ్య ఘటనను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Related posts

సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ… ఏపీ ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం!

Drukpadam

చంద్రబాబు బెయిల్ పిటిషన్.. నాట్ బిఫోర్ మీ అన్న హైకోర్టు న్యాయమూర్తి

Ram Narayana

లేడీ కానిస్టేబుల్ పై దాడి కేసులో జిగ్నేష్ మేవానీకి బెయిల్!

Drukpadam

Leave a Comment