Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ కో బీజేపీకో బీ-టీమ్ లా ఉండాల్సిన అవసరం నాకు లేదు: షర్మిల

టీఆర్ఎస్ కో బీజేపీకో బీ-టీమ్ లా ఉండాల్సిన అవసరం నాకు లేదు: షర్మిల
-టీఆర్ యస్ మధిర మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాలత షర్మిలకు మద్దతు
తెలంగాణలో పార్టీ స్థాపనకు ఉరకలేస్తున్న షర్మిల
నేడు ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం
తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని స్పష్టీకరణ
సమస్యల సాధన కోసమే రాజకీయ పార్టీ అని వెల్లడి
తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై ప్రచారం జరుగుతున్నట్టుగా, తాను టీఆర్ఎస్ కో , బీజేపీకో, మరెవరికో బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. ఆ విధంగా ఉండాల్సిన అవసరం కూడా తనకు లేదని షర్మిల వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు .అది అంత తేలికైనదికాదు కష్టం ఉందని తెలిసి వైయస్ ఆర్ ఆశయాల సాధనే లక్ష్యం గా పనిసేస్తామని అన్నారు. మన ఎదురుగ ఉన్నది పెద్ద కొండా అని తెలిసి రంగంలోకి దిగుతున్నామని అన్నారు.తనకు లభిస్తున్న మద్దతు అక్క నీతో కలిసి పని చేస్తామని అనేక మంది వచ్చి కలుస్తున్నారని వారికీ అందరికి ప్రత్యేక కృతఙ్ఞతలు అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల సాధన కోసమే తెలంగాణలో పార్టీ స్థాపిస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. అంతేతప్ప, తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో షర్మిల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సభలోనే పార్టీ ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.
మధిర మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాలత టీఆర్ యస్ షాక్
మధిర మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాలత టీఆర్ యస్ షాక్ ఇచ్చారు . ఆమె టీఆర్ యస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైయస్ షర్మిల స్థాపించబోయే పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.గతంలో ను వైయస్ పార్టీ తో ఉన్న విద్యాలత కుటుంబం తరువాత కాలంలో కాంగ్రెస్ లో చేరింది . మున్సిపల్ ఎన్నికలకు ముందు టీఆర్ యస్ పార్టీలో చేరారు.తిరిగి షర్మిల తెలంగాణాలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినందువల్ల ఆమెతో కలిసి పని చేయాలనీ నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Related posts

ఐకమత్యానికి ప్రతీక సాముహిక వనభోజనాలు మాజీ ఎంపీ పొంగులేటి!

Drukpadam

జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా?: కమలహాసన్…

Drukpadam

రేవంత్ రెడ్డి నియామకానికి రూ. 25 కోట్లు తీసుకున్నానా?.. క్షమాపణ చెప్పండి: ఎమ్మెల్యే సుధీర్!

Drukpadam

Leave a Comment