Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టులకు ,ఎమ్మెల్యేలకు త్వరలో ఇళ్ల స్థలాలు :సీఎం కేసీఆర్!

జర్నలిస్టులకు ,ఎమ్మెల్యేలకు త్వరలో ఇళ్ల స్థలాలు :సీఎం కేసీఆర్!
-ఈ నెలాఖరులోగా పరిస్కారం లభిస్తుంది
-మార్చ్ నెలలో కచ్చితంగా జర్నలిస్టులకు , ఎమ్మెల్యేల సమస్య పరిస్కారం
-కావాల్సినంత స్థలం ఉంది…ఒకచోట కాకపోతే రెండుమూడు చోట్ల ఇచ్చుకుందాం

జర్నలిస్టులకు ,ఎమ్మెల్యేలకు త్వరలో ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం సాయంత్రం ప్రగతి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రం ప్రవేశ పెట్టిన 2022 -23 బడ్జెట్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్ కేంద్ర బడ్జెట్ అంతా గోల్మాల్ గోవిందంగా అభివర్ణించారు . పసలేని బడ్జెట్ ,ఇంత ఘోరమైన బడ్జెట్ ఎంతవరకు చూడలేదని దుయ్యబట్టారు . బీజేపీ బలహీన పడిందని , యూపీ ఎన్నికల్లో కచ్చితంగా ఆ పార్టీకి తక్కువ సీట్లు వస్తాయని తనకు సమాచారం ఉందని అన్నారు.2024 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. తన పార్టీకి అసెంబ్లీ లో 95 నుంచి 105 సీట్లు వస్తాయని అన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ స్వయంగా జర్నలిస్టుల విషయం ప్రస్తావించారు. నెల రోజుల్లో జర్నలిస్టుల ,ఎమ్మెల్యేల ఇళ్ల స్థలాల సమస్య పరిస్కారం అవుతుందని తెలిపారు. సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడానని ఫిబ్రవరి నెలాఖరుకు క్లియర్ అవుతుందని భావిస్తున్నామని దాదాపు మార్చ్ లో కచ్చితంగా సమస్య పరిస్కారం అయి మీకు శుభవార్త వినిపిస్తామని వివరించారు. రాష్టంలో జర్నలిస్టులకు ఇచ్చేందుకు కావాల్సినంత స్థలం ఉందని ఒక్కచోట కాకపోతే రెండుమూడు చోట్ల ఇచ్చుకుందామని దాని భాద్యత తనదేనని కేసీఆర్ పేర్కొన్నారు.

Related posts

వైద్య ,వ్యవసాయ రంగాలపై కేంద్ర కెబినెట్ కీలక నిర్ణయాలు!

Drukpadam

అబూ సలేం కేసు విచారణ సందర్భంగా.. కేంద్ర ప్ర‌భుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం!

Drukpadam

జర్మనీ అధీనంలో భారతీయ బాలిక.. స్వదేశానికి పంపించాలంటూ కేంద్రం ఒత్తిడి…

Drukpadam

Leave a Comment