Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జ‌గ‌న్ ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన డాక్టర్ గురుమూర్తి

  • ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక
  • డాక్టర్ గురుమూర్తిని తమ అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ
  • బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక
Tirupati YSRCP candidate Gurumurthy meets Jagan

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలకు డాక్టర్ గురుమూర్తిని తమ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ను గురుమూర్తి కలిశారు. తనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ కు పుష్పగుచ్ఛం అందించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గురుమూర్తికి జగన్ ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. మార్చి 23న నోటిఫికేషన్‌ విడుదల, ఏప్రిల్‌ 17న పోలింగ్‌, మే 2న ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపింది.

————————————————————————————————

దృక్పధం గతంలో రాసిన ఈ స్టోరీని పాఠకులకు తిరిగి అందిస్తుంది

——————————————————————————————–
గురుమూర్తి ఈపేరు ఇప్పుడు ఆంధ్రదేశం లో మారుమోగుతున్నది .తానూ రాజకీయాల్లోకి వస్తాననిగాని , పార్లమెంటుకు పోటీచేస్తాననిగాని ఉహించి వుండడు గురుమూర్తి .కానీ అది జరుగుతుంది .తిరుపతికి జరగనున్న ఉప ఎన్నికల్లో వై యస్ ఆర్ సీపీ అభ్యర్థిగా గురుమూర్తి పోటీచేయబోతున్నాడు . ఎక్కడో చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో ఒక కుగ్రామం లోని సామాన్యు పేద కుటుంబంలో జన్మించిన గురుమూర్తి ఫిజియోతెరపిస్ట్ . ఉపఎన్నికల్లో ఎంపీ అయి ఢిల్లీ పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి వై సీ పీ శ్రేణులు . కాలం కలిసిరావడం అంటే ఇదేనేమోనని అంటున్నారు ఇది విన్నవారు . వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భగా ఆయనకు వెంట ఉండి వైద్యసేవలు అందించిన గురుమూర్తి నిజంగానేఅదృష్టవంతుడు అంటున్నారు అతని సన్నిహితులు . అంతకు ముందు షర్మిల పాదయాత్ర లోను ఆమె వెంటే ఉండి వైద్య సేవలు అందించారు . తిరపతి లోకసభకు వై యస్ ఆర్ కాంగ్రెస్ తరుపున ఎన్నికైన దుర్గాప్రసాద్ ఆకాల మరణం తో ఉపఎన్నిక వచ్చింది . దీంతో సంప్రదాయం ప్రకారం సహజంగా కుటుంబ సభ్యలను పోటీకి దించుతారు . అలెక్క ప్రకారం అందరు దుర్గాప్రసాద్ కుటుంబంలోని అతని కొడుకు లేదా భార్యనో పోటీలో నిలుపుతారని భావించారు . ఈ విషయం పై తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల తో జగన్ చర్చలు జరిపారు . అందరు అధినేత జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. దీంతో దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను సంప్రదించి వారికి ఎమ్మెల్సీ ఇస్తానని ఒప్పించి పాదయాత్ర సందర్భగా ఆయనకు వెంట ఉండి వైద్యసేవలు అందించిన గురుమూర్తిని అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ విషయాన్నీ గురుమూర్తికి పిలిచి చెప్పటంతో ఆయనకు మాటలు రాలేదు . ఆశ్చర్యానికి గురైయ్యారు తెరుకుని …సార్ నేను పేదవాడిని నాదగ్గర ఒక్క పైసలేదు ….. నేను …నేను…లోకసభకు పోటీచేయటం ఏంటి సార్ మీ నిర్ణయానికి కృతజ్నతలు నాకు వద్దులెండి సార్ అన్నారట . దీనికి జగన్ మోహన్ రెడ్డి నవ్వుతూ గురుమూర్తి నువ్వు ఒక్కపైసా పెట్టాల్సిన పనిలే …. అంతా నేను చూసుకుంటానని హామీ ఇచ్చి ఒప్పించారట . అయితే గురుమూర్తి విషయంలో మరో ట్యిస్ట్ ఉంది. పాదయాత్ర అయిపోయిన తరువాత గురుమూర్తి తనపనిలో తాను ఉన్నాడు . జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి సీఎం ను కలుద్దామని తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ కు వెళ్ళాడు అక్కడున్న అధికారులు సీఎం ను ఇప్పుడు కలవటం కుదరదని చెప్పటంతో చేసేదిలేక పెద్దవాళ్ళు ఇంతే అనుకోని వెళ్ళిపోయాడు . తరువాత విశాఖ నుంచి ముఖ్యమంత్రి విమానంలో విజయవాడకు వస్తుండగా అదేవిమానములో గురుమూర్తి ప్రయాణం చేసేందుకు ఎక్కాడు . ఆయన్ను చూసిన జగన్ మోహన్ రెడ్డి ఆపాయ్యయంగా గురుమూర్తి అని పిలుపు నన్ను ఇక్కడ ఎవరు పిలుస్తున్నారని చూసే లోపు ఎదురుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సార్…సార్ ఆశ్చర్యానికి గురి అవడం గురుమూర్తి వంతు విమానంలో ఉన్నవారు ఆయన వెంట ఉన్న వారికి ఆసక్తి …….గురుమూర్తిని పలకరించి పక్కన కూర్చోపెట్టుకొని యోగక్షేమాలు అడిగాడు . నేను నిన్ను వచ్చి కలవమని చెప్పానుకదా ఎందుకు కలవలేదని అన్నాడు . దీంతో గురుమూర్తి సార్ నేను మిమ్ములను కలిసేందుకు వచ్చాను . అక్కడ ఉన్నవాళ్లు కలవటం కుదరదన్నారు . అనిచెప్పటంతో రేపు వచ్చి కలవమని చెప్పి నాటి నుంచి సీఎం ఆఫీస్ లోనే కొలువు ఇచ్చాడు . బాపట్ల పార్లమెంటు సభ్యడు నందిగం సురేష్ విషయంలోనూ ఇలాగానే జరిగింది . దీంతో దటీజ్ జగన్ అంటున్నారు ఆయన అభిమానులు.

Related posts

తిరుపతి ఉపఎన్నికలలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా ?

Drukpadam

రాష్ట్రపతి వద్దే వద్దు …ప్రధాని పదవే ముద్దు ముద్దు …. మాయావతి!

Drukpadam

శశిథరూర్ తో నన్ను పోల్చొద్దంటున్న మల్లికార్జున్ ఖర్గే!

Drukpadam

Leave a Comment