Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ ను ఓడించే శక్తి బీజేపీకే ఉంది … కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

టీఆర్ యస్ ను ఓడించే శక్తి బీజేపీకే ఉంది … కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి
-నాగార్జున సాగర్ పోటీ చేయమని బీజేపీ కోరుతుందన్న రాజగోపాల్ రెడ్డి
-నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి ప్రస్తావన
-బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందన్న వెల్లడి
-ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి
-స్వార్థం కోసం పార్టీ మారనని ఉద్ఘాటన
-రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. ఒక సందర్బాల్లో ఆయన బీజేపీ లో చేరానని తేల్చి చెప్పారు . తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్ట్రం చేశారు. ఆయన మాటలు రాజకేయవర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాత్రం గందర గోళానికి గురి అవుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని పునరుద్ఘాటించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. బీజేపీలో చేరాలంటూ తనకు ప్రతిపాదనలు వస్తున్న మాట నిజమేనని అంగీకరించారు. నాగార్జున సాగర్ బరిలో దిగాలని బీజేపీ తనను కోరుతోందని వెల్లడించారు. ఒకవేళ తాను బీజేపీలోకి వెళ్లి, సాగర్ బరిలో దిగితే మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మూడోస్థానమేనని అన్నారు. టీఆర్ఎస్ ను గద్దె దింపడమే తన లక్ష్యమని, అయితే బీజేపీలో చేరే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. స్వార్థం కోసం పార్టీ మారాలని తాను భావించడంలేదని, ప్రజా శ్రేయస్సే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ ఆయన నాగార్జున సాగర్ బరిలో దిగాలని భావిస్తే మునుగోడులో ఉప ఎన్నిక తప్పదు. అయితే ఇది వాస్తవరూపం దాల్చే అవకాశాలు చాలా తక్కువ అని భావిస్తున్నారు.

Related posts

రాఫెల్ డీల్ దొంగతనం ఢిల్లీలో బట్టబయలు చేస్తాం: సీఎం కేసీఆర్!

Drukpadam

దేశాభివృద్ధిలో తెలంగాణది కీలకపాత్ర: ప్రధాని మోదీ…!

Drukpadam

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ఉరితీసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు :భట్టి

Drukpadam

Leave a Comment