Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జీపీఎస్ పరికరంతో భర్త రాసలీలల గుట్టురట్టు చేసిన భార్య

జీపీఎస్ పరికరంతో భర్త రాసలీలల గుట్టురట్టు చేసిన భార్య

  • గుజరాత్ లో అక్రమ సంబంధం వ్యవహారం
  • బిజినెస్ ట్రిప్పుల పేరిట భర్త శృంగార యాత్రలు
  • జీపీఎస్ తో భర్త లొకేషన్ ను పట్టేసిన భార్య
  • పోలీసులకు ఫిర్యాదు

గుజరాత్ లో మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్న భర్తను ఓ భార్య ఎలా పట్టుకుందో చూడండి. ఆమె భర్త ఓ వ్యాపారవేత్త. కోట్ల రూపాయల వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు. భార్య కూడా అదే కంపెనీలో డైరెక్టర్ గా కొనసాగుతోంది. అయితే, 41 ఏళ్ల ఆ వ్యాపారవేత్త మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో భార్యకు అనుమానం తలెత్తింది.

తరచుగా బిజినెస్ టూర్లు అంటూ బయటికి వెళుతున్న భర్త ఏంచేస్తున్నాడో తెలుసుకునేందుకు ఆమె సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించింది. భర్త వాహనంలో ఓ జీపీఎస్ పరికరాన్ని రహస్యంగా అమర్చింది. గత ఏడాది నవంబరులో భర్త తాను వ్యాపార పనుల నిమిత్తం బెంగళూరు వెళుతున్నానని భార్యతో చెప్పాడు. అయితే, జీపీఎస్ లొకేషన్ మాత్రం కారు మహారాష్ట్రలోని పూణేలో ఉన్నట్టు చూపిస్తోంది. దాంతో భార్యలో అనుమానం మరింత బలపడింది.

వెంటనే భర్త బస చేసిన హోటల్ సిబ్బందిని ఆరా తీసింది. ఆ వ్యాపారవేత్త తన భార్యతో కలిసి వచ్చాడని హోటల్ సిబ్బంది చెప్పారు. భార్యను తాను ఇక్కడ ఉండగా, ఇదెలా సాధ్యమని భావించిన ఆమె… హోటల్ సిబ్బందికి విజ్ఞప్తి చేసి సీసీటీవీ ఫుటేజి పరిశీలించింది. అందులో భర్త మరో స్త్రీతో కలిసి హోటల్ లోకి వెళుతుండడం కనిపించింది. అంతేకాదు, హోటల్ లో ప్రవేశించే సమయంలో గాళ్ ఫ్రెండ్ ను భార్య అని చెప్పాడని, అందుకోసం తన ఆధార్ కార్డును తీసుకెళ్లాడని భార్య గుర్తించింది.

దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకున్నారు. 419 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా, భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న సదరు వ్యాపారవేత్త, అతడి ప్రేయసి ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

Related posts

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భార్య అమృతకూ వై ప్లస్ భద్రత!

Drukpadam

బీఆర్‌ఎస్ నేతలపై రెండో రోజూ ఐటీ సోదాలు….

Drukpadam

మాచర్లలో పిన్నెల్లి కోటను బద్దలు కొట్టిన జూలకంటి…

Ram Narayana

Leave a Comment