Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తీవ్ర ఉత్కంఠత రేపుతున్న ఖమ్మం ,నల్లగొండ ,వరంగల్ పట్టభద్రుల కౌంటింగ్

రెండవ రౌండ్ లోను అదే సీన్ రిపీట్
పల్లా ,తీన్మార్ ,కోందండరాం

తీవ్ర ఉత్కంఠత రేపుతున్న ఖమ్మం ,నల్లగొండ ,వరంగల్ పట్టభద్రుల కౌంటింగ్
-ఆధిక్యంలో పల్లా ,గట్టి పోటీనిస్తున్న తీన్మార్ మల్లన్న , కోదండరాం
-మొదటి ప్రాధన్యత గెలుపు అసాధ్యం
-నాలుగు ,ఐదు స్థానాలలో బీజేపీ ,కాంగ్రెస్

ఖమ్మం ,నల్లగొండ ,వరంగల్ పట్టభద్రుల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠతను రేపుతున్నది . మొదటి ప్రాధాన్యతతోనే అధికార పార్టీ అభ్యర్థి గెలుస్తాడని అనుకుంటే అందుకు భిన్నంగా పట్టభద్రులు ఆలోచించినట్లుగా కౌంటింగ్ ను భట్టి తెలుస్తుంది.రెండవ రౌండ్ ఫలితాలలో కూడా పల్లా రాజేశ్వర రెడ్డికి ఆధిక్యం వచ్చినప్పటికీ ఇదే విధంగా వస్తే ఫలితం ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన టీఆర్ యస్ శ్రేణుల్లో కనిపిస్తుంది. రెండవ రౌండ్లో పల్లా కు 15857 ఓట్లు రాగ , తీన్మార్ మల్లన్న కు 12070 ఓట్లు లభించాయి.ఇక ప్రొఫెసర్ కోదండరాం కు 9448 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 6669 కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ కు 3244 ,రాణి రుద్రమకు 1643 ,చెరుకు సుధాకర్ కు ,1330 ,లెఫ్ట్ అభ్యర్థి జయసారధిరెడ్డి కి 1263 ఓట్లు లభించాయి.ఇంకా ఐదు రౌండ్లు లెక్కించాల్సి ఉంది.

Related posts

జగన్ అక్రమాస్తుల కేసు.. మొత్తం వ్యవహారాన్ని విడివిడిగా చూస్తే నేరం కనిపించదన్న సీబీఐ!

Drukpadam

మంచు ఖండంలోనూ మహిళలకు లైంగిక వేధింపులు!

Drukpadam

ఆ రాష్ట్రంలో వందేళ్లు దాటిన ఓటర్లు 17 వేల మంది!

Drukpadam

Leave a Comment