మూడవ రౌండ్ పూర్తి …పల్లా ఆధిక్యం 12142ఓట్లు
-తీన్మార్ మల్లన్న ,పల్లా మధ్య పోటాపోటీ
-మూడవ స్థానంతో సరిపెఎత్తుకుంటున్న ప్రొఫెసర్
నల్లగొండ కేంద్రంగా జరుగుతన్న పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ యస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మూడవ రౌండ్ పూర్తీ అయ్యేసరికి 12142 ఓట్ల ఆధిక్యం వచ్చినప్పటికీ అవి గెలుపుకు చాలాదూరంలోనే ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన తీన్మార్ మల్లన్న నుంచి టీఆర్ యస్ అభ్యర్థి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.అందువల్ల విజేతను నిర్ణయించేందుకు ఎలిమినేషన్ ప్రాసెస్ తప్పని సరి అవుతుంది. మొత్తం 71 అభ్యర్థులు రంగంలో ఉండటంతో లెక్కింపు ప్రక్రియ ఆలశ్యం అవుతుంది.
మూడవ రౌండ్ పూర్తి అయ్యోసరికి టీఆర్ యస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి 12142 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడవ రౌండ్ లోను మొదటి రెండు రౌండ్లలో వచ్చిన ఫలితాలే రిపీట్ అయ్యాయి.
మూడవ రౌండ్‌లో పల్లా రాజేశ్వరరెడ్డికి 17393 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 13238, కోదండరామ్ కు 11907 ఓట్లు లభించాయి. బీజేపీ కి చెందిన ప్రేమేందర్ రెడ్డికి 5320 వచ్చాయి.
మూడవ రౌండ్ పూర్తి అయ్యేసరికి పల్లా కు 49380 తీన్మార్ కు 37238 కోదండరాం కు 30435 ,బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 18504 ఓట్లు లభించాయి. ఇంకా నాలుగు రౌండ్ లు లెక్కించాల్సిఉంది.